రౌడీ జనార్ధన వైల్డ్ గ్లింప్స్.. ఊచకోత మామూలుగా లేదుగా!
ఇక విజయ్ మేకోవర్ విషయానికి వస్తే, నెవ్వర్ బిఫోర్ అని చెప్పాల్సిందే. ఒంటి నిండా రక్తం, చేతిలో కత్తి, కళ్ళలో పగ.. ఇలా ఒక హై వోల్టేజ్ పాత్రలో విజయ్ ని చూడటం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చేలా ఉంది 'రౌడీ జనార్ధన' టైటిల్ గ్లింప్స్. దర్శకుడు రవికిరణ్ కోలా మాస్ పల్స్ ని కరెక్ట్ గా పట్టుకున్నాడని ఈ చిన్న వీడియోతోనే అర్థమవుతోంది. లవర్ బాయ్ ఇమేజ్ ని పక్కన పెట్టి, విజయ్ ఒక రా అండ్ రస్టిక్ అవతార్ లోకి మారిపోయాడు. ఈ గ్లింప్స్ చూస్తుంటే, ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక రౌడీ ప్రస్థానం అని క్లియర్ గా తెలుస్తోంది.
వీడియో ఓపెనింగ్ లోనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ సినిమా టోన్ ఏంటో చెప్పేసింది. "గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా? నేను చూసాను" అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ వాయిస్ ఓవర్ సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేస్తూ, హీరో క్యారెక్టర్ ఎంత వయొలెంట్ గా ఉండబోతుందో హింట్ ఇస్తోంది. కత్తులతో చేసే విన్యాసాలు, మంటల మధ్య జరిగే పోరాటాలు విజువల్ గా చాలా గ్రాండ్ గా ఉన్నాయి.
ఇక విజయ్ మేకోవర్ విషయానికి వస్తే, నెవ్వర్ బిఫోర్ అని చెప్పాల్సిందే. ఒంటి నిండా రక్తం, చేతిలో కత్తి, కళ్ళలో పగ.. ఇలా ఒక హై వోల్టేజ్ పాత్రలో విజయ్ ని చూడటం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. "కన్నీళ్లను ఒంటికి నెత్తురులాగా పూసుకున్నోడు.." అనే డైలాగ్ హీరో తెగింపుని పర్ఫెక్ట్ గా వర్ణిస్తోంది. విజయ్ చెప్పే డైలాగ్స్ చాలా నేచురల్ గా, పవర్ ఫుల్ గా ఉన్నాయి.
గ్లింప్స్ లో మరో హైలైట్ పాయింట్ మ్యూజిక్. క్రిస్టో జేవియర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కి ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో వచ్చే సౌండ్ డిజైన్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఆనంద్ సి చంద్రన్ సినిమాటోగ్రఫీ ఆ రూరల్ అట్మాస్ఫియర్ ని, ఆ డార్క్ మూడ్ ని చాలా బాగా క్యాప్చర్ చేసింది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా ఉన్నాయని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తోంది.
"కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు.. జనార్ధన.. రౌడీ జనార్ధన" అంటూ టైటిల్ ని రివీల్ చేసిన విధానం అదిరిపోయింది. ఒక సాధారణ వ్యక్తి 'రౌడీ'గా ఎలా మారాడు? ఆ పేరు వెనుక ఉన్న పెయిన్, వయొలెన్స్ ఏంటి? అనేదే ఈ సినిమా కథ అని అర్థమవుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 2026లో రాబోతోంది.
ఏదేమైనా 'రౌడీ జనార్ధన' గ్లింప్స్ చూస్తుంటే, విజయ్ ఈసారి బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే సౌండ్ చేసేలా ఉన్నాడు. రొటీన్ మాస్ సినిమాలు కాకుండా, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న రా యాక్షన్ డ్రామాని ఎంచుకోవడం మంచి నిర్ణయం. ఈ సినిమాతో విజయ్ తనలోని అసలైన మాస్ యాంగిల్ ని బయటపెట్టబోతున్నాడని, ఆడియెన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నాడని నమ్మొచ్చు. ఇక రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయో చూడాలి.