అనుపమని దూరం పెట్టారెందుకు..?

టాలీవుడ్ లో ఆల్రెడీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి పాపులారిటీ తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ సడెన్ గా ఏమైందో ఏమో గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది.;

Update: 2026-02-06 08:30 GMT

టాలీవుడ్ లో ఆల్రెడీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి పాపులారిటీ తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ సడెన్ గా ఏమైందో ఏమో గ్రాఫ్ డౌన్ అవుతూ వచ్చింది. అలా ఊహించని విధంగా అమ్మడికి ఇక్కడ అవకాశాలు లేని విధంగా పరిస్థితి మారింది. ఒకప్పుడు యువ హీరోల సినిమాల్లో అనుపమ బెస్ట్ ఆప్షన్ అనిపించేలా చేసుకోగా రాను రాను అమ్మడు టాలీవుడ్ కి దూరం అవుతూ వచ్చింది.

మరోపక్క తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసినా అమ్మడికి అక్కడ కూడా ఆశించిన క్రేజ్ రాలేదు. ఐతే తెలుగులో అనుపమకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇక్కడ ఛాన్స్ ల కోసం అనుపమ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఛాన్స్ లు తక్కువ అవ్వడం చేసిన సినిమాలు కూడా డిజప్పాయింట్ చేయడం వల్ల అనుపమని మన మేకర్స్ సైడ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ తమిళ్ లో డ్రాగన్, బిసన్ సినిమాలు చేసి సక్సెస్ అందుకుంది అనుపమ.

సినిమాలు లేక ఖాళీగా..

ఐతే తెలుగులో మాత్రం పరదా, కిష్కిందపురి సినిమాలు చేసింది. బెల్లంకొండ కిష్కిందపురి కాస్త బెటర్ అనిపించినా కూడా అమ్మడికి నెక్స్ట్ ఛాన్స్ తీసుకురాలేదు. చివరగా తమిళ్ లో లాక్ డౌన్ సినిమా చేసిన అనుపమ ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంది. తెలుగులో తనకు ఉన్న పాపులారిటీకి అవకాశాలు వచ్చే హోప్ ఉన్నా కూడా అమ్మడికి బ్యాడ్ లక్ కొనసాగుతుండటం వల్ల అవి రావట్లేదు.

తమిళ్ లో అనుపమ చేస్తున్న సినిమాలకు మంచి రిజల్ట్స్ వస్తున్న కారణంగా అక్కడ ఆమెకు అవకాశాలు రావొచ్చు. ప్రస్తుతానికి అయితే తెలుగులో అనుపమకి అవకాశాలు లేవు కానీ మళ్లీ తిరిగి ఇక్కడ కూడా బిజీ అవ్వాలని చూస్తుంది అమ్మడు. కెరీర్ సెట్ రైట్ చేసుకునేందుకు ఒక భారీ తెలుగు ఆఫర్ కోసం చూస్తున్న అనుపమకి అలాంటి ఒక సినిమా పడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

పరదా లాంటి ప్రయోగాత్మక సినిమా చేసినా కూడా..

అంతకుముందు కాస్త బొద్దుగా ఉండి తెలుగు ఆడియన్స్ ప్రేమను పొందిన అనుపమ మధ్యలో ఏమైందో ఏమో కానీ స్లిమ్ లుక్ తో షాక్ ఇచ్చింది. ఐతే ఆమె లుక్ మారిన తర్వాత తెలుగులో సరైన బ్రేక్ రాలేదు. వేరే భాషల్లో ఆఫర్లు అందుకుంటున్నా అనుపమని తెలుగు ఆడియన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. పరదా లాంటి ప్రయోగాత్మక సినిమా చేసినా కూడా అనుపమ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

టాలీవుడ్ పక్కన పెడితే తమిళ్, మలయాళంలో కూడా ప్రస్తుతం అనుపమకి ఎలాంటి ఛాన్స్ రాలేదు. కెరీర్ లో మళ్లీ పుంజుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న అనుపమ తిరిగి మళ్లీ ఫాం కొనసాగించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. స్టార్ క్రేజ్ తగ్గిన ఒకటి రెండు ఫ్లాపులు పడిన తర్వాత మళ్లీ ఆ హీరోయిన్ లైం లైట్ లోకి రావాలంటే కాస్త టైం పడుతుంది. ఐతే అప్పటిదాకా అనుపమ తన ఫోకస్ తగ్గకుండా ప్రయత్నించాల్సి ఉంటుంది. ప్రేమం తో మెప్పించిన అనుపమ సౌత్ లో ఉన్న హీరోయిన్స్ లో తనకంటూ ఒక స్పెషాలిటీ తెచ్చుకోగా ప్రస్తుతం అమ్మడు మాత్రం కెరీర్ లో రిస్క్ ఫేస్ చేస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News