మాఫియా క్వీన్‌లా లేడీ బాస్‌లా చెలరేగిన బెబో

ఈ లుక్ చూసాక‌... కొందరైతే అచ్చం మాఫియా క్వీన్ అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు బోబోలోని ఎప్పటికీ తరగని ఎనర్జీని గుర్తు చేసుకుంటున్నారు.

Update: 2026-10-22 16:22 GMT

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ మరోసారి తన అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేశారు. అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికైన ఐఫా (IIFA) అవార్డ్స్ కోసం అబుదాబిలో అడుగుపెట్టిన‌ప్ప‌టి లుక్ ఇప్పుడు విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన‌ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. `సీ యూ ఇన్ అబుదాబి` అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్‌లో బెబో లుక్ అత్యంత స్టైలిష్‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. క‌చ్ఛితంగా అబుద‌బీ ఈవెంట్లో బెబో షో స్టాప‌ర్ గా నిలిచిందంటే అతిశ‌యోక్తి కాదు.

ఈ ఫోటోషూట్‌లో కరీనా కేవలం నటిగా మాత్రమే కాకుండా.. ఒక పవర్ ఫుల్ మాఫియా క్వీన్ లేదా గ్యాంగ్ లీడర్ లాగా కనిపించి అభిమానులను ఫిదా చేసింది. ముఖ్యంగా ఈ భామ‌ ధరించిన బ్లాక్ లెదర్ కోట్.. దానికి తగ్గట్టుగా ఉన్న హెయిర్ స్టైల్, ఆ కళ్లలోని ఇంటెన్సిటీ చూసేవారికి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఒక లేడీ బాస్ లాగా బోబో ఫోజులు ఇంటర్నెట్‌లో సెగలు పుట్టిస్తున్నాయి. సాధారణ ఫ్యాషన్ ఫోటోషూట్‌లా కాకుండా.. ఒక హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలోని డాన్ క్యారెక్టర్‌ను తలపించేలా క‌రీనా అప్పీయ‌రెన్స్ ద‌డ పుట్టిస్తోంది.

 

ఈ లుక్ చూసాక‌... కొందరైతే అచ్చం మాఫియా క్వీన్ అంటూ ప్రశంసిస్తుండగా, మరికొందరు బోబోలోని ఎప్పటికీ తరగని ఎనర్జీని గుర్తు చేసుకుంటున్నారు. గ్లామర్‌తో పాటు ఒక సీరియస్ యాటిట్యూడ్‌ను ప్రదర్శించడంలో బెబో తర్వాతే ఎవరైనా అని ప్రూవైంది.

 

కరీనా అద్భుతమైన లుక్స్‌పై బాలీవుడ్ ప్రముఖులు సైతం ఫిదా అయిపోయారు. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ `బెబో మే బెబో..` అంటూ తనదైన శైలిలో ప్రేమను కురిపించగా, స్టార్ హీరోయిన్ ఆలియా భట్ `సూపర్‌స్టార్` అంటూ ఫైర్ ఎమోజీలతో ప్రశంసించారు. అలాగే సోదరి కరిష్మా కపూర్, వదిన సబా పతావుడితో పాటు శ్రీయ శరణ్, ప్రగ్యా జైస్వాల్, జహాన్ కపూర్ వంటి పలువురు సెలబ్రిటీలు కామెంట్ల వర్షం కురిపిస్తూ బెబో స్ట‌న్నింగ్ లుక్‌ను ఆకాశానికి ఎత్తేశారు.

ఇదిలాఉంటే.. సినిమాల పరంగా 2026 కరీనా కపూర్ కెరీర్‌కు ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఏడాది మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా `ధైరా`తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కలిసి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూనే, మరోవైపు గ్లామర్ ప్రపంచంలో తన హవాను ఏమాత్రం తగ్గించకుండా దూసుకెళ్తున్న కరీనా... సినిమాలతో పాటు ఇలాంటి గ్లామర్ అప్‌డేట్స్‌తోనూ ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.

Tags:    

Similar News