రామ్ చరణ్ కి హిట్ తో పని లేదు... సరైన దర్శకుడు కావాలి...

శంకర్ డైరెక్షన్లో చేసిన 'గేమ్ చేంజర్' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఆ మూవీలో రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్రకి ఎనలేని క్రేజ్ దక్కింది.

Update: 2026-10-22 22:30 GMT

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. తను పోషించిన 'రామరాజు' పాత్ర కెరీర్ లోనే గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచిపోయింది. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత ఆయన ఆ రేంజ్ సక్సెస్ ని మరోసారి దక్కించుకోలేకపోతున్నాడు. కారణమేంటంటే రాజమౌళి లాంటి దర్శకుడితో సినిమా చేసిన తర్వాత ఎవరైనా సరే ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తారు. రామ్ చరణ్ సైతం అదే చేశాడు. శంకర్ డైరెక్షన్లో చేసిన 'గేమ్ చేంజర్' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఆ మూవీలో రామ్ చరణ్ పోషించిన అప్పన్న పాత్రకి ఎనలేని క్రేజ్ దక్కింది.

రాజమౌళి మూవీ తరువాత సినిమా అంటే కష్టమే...

రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేసిన తర్వాత అనుభవం ఉన్న దర్శకులతో సినిమాలు చేయాలి. కారణం ఏంటంటే రాజమౌళి తన హీరోలను టాప్ లెవల్లో చూపెడతాడు.అప్పటి దాకా వాళ్ళకి ఉన్న ఇమేజ్ ను ఒక్కసారిగా తారస్థాయికి తీసుకెళ్తాడు. కాబట్టి రాజమౌళి డైరెక్షన్ లో నటించిన ఆ హీరో ఆ తర్వాత రాబోయే సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. రామ్ చరణ్ సైతం ఈ విషయంలో వై విషయాన్ని ప్రదర్శిస్తున్నాడు. తనను కొత్తగా చూపించగలిగే దర్శకులు దొరికినప్పుడు మాత్రమే అతనికి సక్సెసులు వరిస్తున్నాయి... రామ్ చరణ్ బుచ్చిబాబుకి అవకాశం ఇచ్చాడు. నిజానికి యంగ్ డైరెక్టర్లకి అవకాశం ఇస్తే వాళ్ళు సినిమా ఎలా చేస్తారో అనే ఉత్కంఠ అందరిలో ఉంటుంది. కానీ రామ్ చరణ్ మాత్రం ధైర్యం చేసి తన సినిమాని బుచ్చిబాబుకి ఇచ్చాడు. బుచ్చిబాబు పెద్ది మూవీతో ఒక డీసెంట్ సక్సెస్ ను అందించాడు. కొత్త దర్శకుడు, అనుభవం లేని దర్శకులతో సినిమాలు చేయడం ఎందుకని చాలామంది చెప్పినప్పటికి రామ్ చరణ్ కమిట్ అయ్యాడు కాబట్టి బుచ్చిబాబుతో సినిమా చేశాడు. ఆయన ఫిక్స్ అయితే ఎవ్వరి మాటలను పట్టించుకోడు. తనకు ఏ కథ అయితే బాగుంటుంది? తనలోని నటుడిని బయటికి తీసే దర్శకుడేవరో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు...

దర్శకుడికి క్లారిటీ...

ఒక సినిమా మీద హీరో ఎక్కువ రోజులు తన సమయాన్ని కేటాయించి ఆ మూవీ మీద భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని తీసుకురాకపోతే ప్రొడ్యూసర్ తోపాటు హీరో కూడా కొంతవరకు నష్టాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ సినిమా మీద ఆయన కేటాయించిన డేట్స్ అనవసరంగా వృధా అయ్యాయని దాని బదులు వేరే డైరెక్టర్ కి డేట్స్ ఇచ్చి ఒక మంచి సినిమా చేసి ఉంటే బాగుండేది కదా అని ఆలోచిస్తుంటారు... దర్శకుడికి ప్రతి విషయం మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎన్ని రోజుల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయొచ్చు అనే విషయంలో క్లారిటిని మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ను సాధిస్తుంది...

సుకుమార్ మూవీస్ లో ఏముంటుది...

సుకుమార్ సినిమాల్లో ఒక రా నెస్ కనిపిస్తుంది. అలాగే అతని సినిమాలు ప్రేక్షకుల బుర్రకు పని చెప్పే విధంగా ఉంటాయి. స్క్రీన్ ప్లే లో వైవిధ్యాన్ని చూపించే ఆయన హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా కథలను డిజైన్ చేసుకుంటూనే వాళ్ళని ఆ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా చూపించడం సుకుమార్ కు తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. రామ్ చరణ్ తో చేసిన 'రంగస్థలం' సినిమా అతనికి భారీ సక్సెస్ ని కట్టబెట్టడమే కాకుండా తనలోని పూర్తిస్థాయి నటుడిని బయటికి తీసింది. ఇప్పుడు అతనితో చేస్తున్న సినిమా మరో సక్సెస్ ను సాధిస్తుందని పూర్తి క్లారిటీ ఇవ్వలేము కానీ సినిమా మాత్రం ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా నిలిచిపోతుందని చెప్పవచ్చు...

డైరెక్టర్ ను నమ్మాలి...

దర్శకుడు రాసుకున్న కథ మీద, ఆయన మేకింగ్ మీద హీరోకి పూర్తి నమ్మకం ఉండాలి. అలాగే రోజు షూటింగ్ స్పాట్ లో ఏ సీన్లు తీస్తున్నారు అన్ని అనుకున్నట్టుగా చేస్తున్నారా? లేదా అనే విషయాల్లో కొంతవరకు క్లారిటీని మెయింటైన్ చేస్తే బాగుంటుంది. దర్శకుడు కి షూటింగ్ షెడ్యూల్ ను నియంత్రణ చేయడం తెలిసుండాలి. కథ బాగా రాసుకోవాలి, దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి దర్శకుడికి పూర్తి క్లారిటి ఉండాలి. లేకపోతే ఏదో విధగా మూవీ తేడా కొట్టే అవకాశం ఉంటుంది...

చరణ్ కి సరైన దర్శకుడు కావాలి...

ప్రస్తుతం రామ్ చరణ్ డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తే బాగుంటుంది. సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తే క్రేజ్ వస్తుందేమో కానీ కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఇండస్ట్రీ ఉన్నంతవరకు గుర్తుండిపోతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ కి సక్సెస్ ఫుల్ సినిమాల కంటే కూడా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయే పాత్రలతో సినిమాలు చేయడం చాలా కీలకం... అలాంటి దర్శకుల కోసమే ఆయన వెతుకుతున్నాడు...

Tags:    

Similar News