'రామాయణ' ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ అప్డేట్.. కానీ ఓ కండిషన్!
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న దృశ్య కావ్యం 'రామాయణ: పార్ట్ వన్' నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు
భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న దృశ్య కావ్యం 'రామాయణ: పార్ట్ వన్' నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. అయితే ఇందులో ఒక చిన్న మెలిక కూడా ఉందట..మరి ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జియోహాట్‌స్టార్‌తో భారీ డీల్:
థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగిసిన తర్వాత 'రామాయణ' సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువచ్చేందుకు ప్రముఖ సంస్థ జియోహాట్‌స్టార్ ముందుకు వచ్చింది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌తో కలిసి ఈ భారీ దృశ్య కావ్యాన్ని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక భారత్‌తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులకు ఈ పౌరాణిక అద్భుతాన్ని మరింత దగ్గర చేయడమే ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశమని జియోస్టార్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు.
ఓటీటీలో 'పే-పర్-వ్యూ' విధానం:
సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి మేకర్స్ ఒక వినూత్న పద్ధతిని తీసుకువచ్చారు. సాధారణ సబ్స్క్రిప్షన్ ప్లాన్లతో ఈ సినిమాను చూడటానికి కుదరదు. థియేట్రికల్ రన్ తర్వాత జియోహాట్‌స్టార్‌లో 'పే-పర్-వ్యూ' మోడల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అంటే యూజర్లు తమ సాధారణ మంత్లీ లేదా ఇయర్లీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, సినిమాను చూడటానికి అదనంగా కొంత మొత్తాన్ని రెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నమాట.
హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్:
ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ యష్ రావణాసురుడిగా, సౌత్ సెన్సేషన్ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్నారు. హాలీవుడ్ లెజెండరీ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, మన ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. ఇక నవంబర్ 5న ఐమాక్స్ 3డీ ఫార్మాట్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో ఈ విజువల్ వండర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెద్ద స్క్రీన్‌పైనే చూడాలంటున్న మేకర్స్:
సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసేవారికి మేకర్స్ ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చారు. 'రామాయణ' లాంటి అద్భుతమైన దృశ్య కావ్యాన్ని మొబైల్స్ లేదా చిన్న స్క్రీన్లపై కాకుండా, వీలైనంత వరకు ఐమాక్స్ 3డీ లాంటి అత్యున్నత సాంకేతికత కలిగిన పెద్ద థియేటర్లలోనే అనుభవించాలని నిర్మాత నమిత్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ ఇతిహాసం చేరాలనే ఉద్దేశంతోనే ఓటీటీలోకి తెస్తున్నప్పటికీ, అసలు సిసలైన అనుభూతి మాత్రం వెండితెరపైనే దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇక మొత్తానికి చూస్తే, బిగ్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌గా రాబోతున్న 'రామాయణ' సినిమాను ఆ తర్వాత ఓటీటీలో చూడాలన్నా ప్రత్యేకంగా డబ్బులు చెల్లించక తప్పదన్నమాట. ఇక ఏదేమైనా ఇండియన్ మైథాలజీని ప్రపంచ స్థాయి హంగులతో చూడబోతున్నామనే ఆనందంలో సినీ ప్రియులు ఈ అప్డేట్ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.