ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి మ‌ద్రాస్ హైకోర్టులో మ‌రో దెబ్బ!

దీంతోనే విజ‌య్ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌వేళ త‌న‌పై మ‌రో పిడుగు ప‌డింది. మ‌ద్రాస్ హై కోర్టులో న‌టుడు, టీవీకే పార్టీ అధినేత విజ‌య్‌కి తాజాగ చుక్కెదురైంది.;

Update: 2026-02-06 08:34 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ టైమ్ అస్స‌లు బాగాలేన‌ట్టుగా ఉంది. అత‌నికి వ‌రుస‌గా దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతూ వ‌స్తోంది. సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్న విజ‌య్ ప్రారంభ ద‌శ‌లోనే భారీ స‌వాళ్ల‌ని ఎదుర్కొంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. వ‌రుస కేసులు, సీబీఐ ఎంక్వ‌రీల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఆయ‌న న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌`ని జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేసి ఆ త‌రువాత నుంచి క్రీయాశీల రాజ‌కీయాల్లో ఫుల్ బిజీ కావాల‌ని విజ‌య్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఆ ప్లాన్ బెడిసికొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఈ మూవీపై సీబీఎఫ్‌సీ వ‌ర్గాలు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం, సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డం, ఆ త‌రువాత దాన్ని స‌వాల్ చేస్తూ టీమ్ మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించ‌డం..ఇరు వ‌ర్గాల వాద‌న‌లు విన్న కోర్టు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల్సిందేన‌ని తీర్పు చెప్పింది. అయితే దాన్ని స‌వాల్ చేస్తూ సీబీఎఫ్‌సీ మ‌ళ్లీ కేసు ఫైల్ చేయ‌డంతో డామిట్ క‌థ మ‌ళ్లీ అడ్డంతిరింది. సినిమా రిలీజ్ ఆగిపోయింది. అది ఎప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుంద‌న్న‌ది ఇప్ప‌టికీ మేక‌ర్స్‌కే క్లారిటీ లేని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే క‌రూర్ తొక్కిస‌లాత‌ ఘ‌ట‌న కార‌ణంగా విజ‌య్ ఇటీవ‌ల చిక్కుల్లో ప‌డిన విష‌యం తెలిసిందే. దీనిపై సీబీఐ ఎంక్వైరీ మొద‌లు కావ‌డంతో హీరో విజ‌య్ సీబీఐ ముందు హాజ‌రు కావ‌డం, సీబీఐ వ‌ర్గాలు విజ‌య్‌ని మ‌రోసారి త‌మ ముందు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డం తెలిసిందే. దీంతోనే విజ‌య్ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌వేళ త‌న‌పై మ‌రో పిడుగు ప‌డింది. మ‌ద్రాస్ హై కోర్టులో న‌టుడు, టీవీకే పార్టీ అధినేత విజ‌య్‌కి తాజాగ చుక్కెదురైంది. ఆదాయ‌ప‌న్ను శాక విధించిన వ్య‌తిరేకంగా విజ‌య్ వేసిన పీటీష‌న్‌ని మ‌ద్రాస్‌ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ చేసిన న్యాయ‌స్థానం ఆ పిటీష‌న్‌ని కొట్టి వేసి విజ‌య్‌కి షాక్ ఇచ్చింది.

205-16 ఆర్థిక సంవ‌త్స‌రానికి గానూ విజ‌య్ రూ.1.50 కోట్లు జ‌రిమానా చెల్లించాల‌ని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై విజ‌య్ 2022లో హైకోర్టుని ఆశ్ర‌యించారు. గ‌త నెల‌లో తీర్పుని రిజ‌ర్వ్ చేసిన న్యాయ‌స్థానం తాజాగా స‌ద‌రు పిటీష‌న్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. ఇంత‌కీ ఐటీ శాఖ జ‌రిమానా ఎందుకు విధించారంటే..2015-16 సంవ‌త్స‌రానికి గానూ ఆదాయ‌ప‌న్ను రిట‌ర్న్‌లు దాఖ‌లు చేసిన‌ప్పుడు ఆ ఏడాది విజ‌య్ రూ.35 కోట్ల ఆదాయం పొదిన‌ట్లు ఆదాయ‌ప‌న్ను శాఖ మ‌ద్రాస్ హైకోర్టులో నివేదిక దాఖ‌లు చేసింది.

అందుకు సంబంధించిన మ‌దింపుని చేప‌ట్టిన ఆదాయ‌ప‌న్ను శాఖ విజ‌య్ ఇంట్లో జ‌రిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప‌త్రాల‌ను చెక్ చేయ‌గా `పులి` సినిమాకు తీసుకున్న రూ.15 కోట్ల ఆదాయాన్ని లెక్క‌ల్లో చూప‌లేద‌ని స్ప‌ష్ట‌మైంది. దాన్ని దాచిపెట్టినందుకు పెనాల్టీగా రూ.1.50 కోట్ల జ‌రిమానా విధిస్తూ ఆదాయ‌ప‌న్ను శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీన్ని స‌వాల్ చేసిన విజ‌య్ మ‌ద్రాస్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం ఫైన‌ల్‌గా ఈ పిటీష‌న్‌ని కొట్టివేసి హీరో విజ‌య్‌కి షాక్ ఇవ్వ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags:    

Similar News