టాక్సిక్ విజువల్స్ పై హుమా ఖురేషి సెన్సేషనల్ కామెంట్స్!
కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ రిలీజ్ కు ఇంకా కొంత టైమ్ ఉన్నప్పటికీ, సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ రిలీజ్ కు ఇంకా కొంత టైమ్ ఉన్నప్పటికీ, సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, తాజాగా బాలీవుడ్ నటి హుమా ఖురేషి చేసిన కామెంట్స్ మరోసారి ఈ సినిమాను చర్చల్లోకి తీసుకొచ్చాయి.
టాక్సిక్లో కీలక పాత్ర పోషిస్తున్న హుమా ఖురేషి, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యష్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. సినిమా పూర్తయ్యాక తాను యశ్‌కు మరింత పెద్ద అభిమానిగా మారిపోయానని ఆమె చెప్పారు. బయట నుంచి చూస్తే ఆయన ఒక పెద్ద స్టార్ గా మాత్రమే అనిపిస్తారని, కానీ సెట్స్‌లో ఆయన పని చేసే తీరు, ప్రతి సీన్ పై చూపించే శ్రద్ధ, సినిమాపై ఉండే డెడికేషన్ చూసిన తర్వాత తనకెంతో స్పూర్తి కలిగిందని వెల్లడించారు.
హుమా కామెంట్స్ లో ఎక్కువగా ఆకర్షించిన అంశం మాత్రం సినిమా విజువల్స్ గురించే. రీసెంట్ గా టాక్సిక్ కు సంబంధించిన కేవలం 8 నుంచి 9 నిమిషాల ఫైనల్ కట్‌ను చూసే అవకాశం తనకు లభించిందని, తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు అలాంటి విజువల్ ప్రెజెంటేషన్ ఎప్పుడూ చూడలేదని ఆమె అన్నారు. అంతేకాదు, ఆడియన్స్ థియేటర్‌లో చూసినప్పుడు ఆశ్చర్యపోవడం ఖాయమని, యశ్ ఈ సినిమాతో తనను తాను మరో స్థాయికి తీసుకెళ్లారని ఆమె వ్యాఖ్యానించడం అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ కామెంట్స్ ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. ఇటీవల సినిమాకాన్ 2026లో టాక్సిక్కు సంబంధించిన 9 నిమిషాల ప్రివ్యూ ప్రదర్శించగా, అక్కడి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించినట్లు అంతర్జాతీయ సినీ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో సినిమాను గ్లోబల్ స్థాయిలో మరింత భారీగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.
మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, సంజీదా షేక్, అక్షయ్ ఒబెరాయ్ వంటి బలమైన తారాగణం నటిస్తోంది. భారీ నిర్మాణ విలువలు, ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్ ట్రీట్, యష్ కెరీర్‌లో కొత్త మేకోవర్ అనే అంశాలు ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచాయి. అయితే ఇప్పటి వరకు రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ కంటే, సినిమా యూనిట్ సభ్యులే విజువల్స్ గురించి ఇంత ధైర్యంగా మాట్లాడటం ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఒక నటిగా ఎన్నో భాషల్లో, హాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో కూడా పనిచేసిన హుమా ఖురేషి ఇలాంటి విజువల్స్ ఎప్పుడూ చూడలేదని చెప్పడం టాక్సిక్‌కు ఎక్స్‌ట్రా బజ్ ను తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం ట్రైలర్‌పై పడింది. హుమా చెప్పిన స్థాయిలో విజువల్ మ్యాజిక్‌ను ట్రైలర్‌లోనూ చూపిస్తే, రిలీజ్ కు ముందే టాక్సిక్ దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.