కాకా..దాదాల్లో డైరెక్టర్లు అలా ట్రై చేస్తున్నారా?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో `కాకా`.. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని `దాదా` చిత్రాలను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సీనియర్ హీరోల వయసుకు తగినట్లుగా కథలను మలుస్తూనే.. వారి బాక్సాఫీస్ స్టామినాను.. మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా పవర్ఫుల్ ఎలివేషన్స్‌ను డిజైన్ చేయడంపై దర్శకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `జైలర్` చిత్రంలో ఆయన పాత్రను డైరెక్టర్ నెల్సన్ ఎలా ఎలివేట్ చేశారో తెలిసిందే. అదే కోవలో టాలీ వుడ్‌లోనూ అలాంటి సంచలన ప్రయోగాలకే ఇద్దరు దర్శకులు సిద్దమైనట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో `కాకా`.. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని `దాదా` చిత్రాలను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో హీరోల పాత్రలను ఆయా దర్శకులు పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారట. రజనీకాంత్ `జైలర్` చిత్రంలో టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్ర మాస్ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుందో? అదే తరహాలో ఇద్దరు లెజెండరీ హీరోల పాత్రలను కూడా ఎలివేట్ చేసేందుకు డైరెక్టర్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలను హ్యాండిల్ చేస్తున్న దర్శకులు రెగ్యులర్ కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా ఆయా హీరోల ట్రేడ్‌మార్క్ మేనరిజమ్స్, గ్రేస్ వయసుకు తగిన ఇంటెన్సిటీని పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తున్నారట. ముఖ్యంగా బాలయ్య మాస్ అప్పీల్‌ను దృష్టిలో పెట్టుకుని `దాదా` చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్‌ను హాలీవుడ్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే `కాకా` చిత్రంలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా స్టైలిష్ విలనిజం.. యాక్షన్ టర్న్‌లతో కూడిన ఎలివేషన్ సీన్స్ సినిమాకే హైలైట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
సీనియర్ హీరోల సినిమాలలో కథ ఎంత బలంగా ఉందో? వారిని స్క్రీన్‌పై ఎలివేట్ చేసే తీరు అంతకంటే ముఖ్యమని `జైలర్` నిరూపించింది. రజనీకాంత్ మేనియాని క్యాష్ చేసుకున్న నెల్సన్ ఎలా అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారో? ఇప్పుడు `కాకా`, `దాదా` డైరెక్టర్లు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచడమే కాకుండా సాధారణ ప్రేక్షకులను సైతం థియేటర్లలో ఈలలు వేయించేలా ఆయా పాత్రల డిజైనింగ్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ తరహా ఎలివేషన్స్ వల్ల హీరోల ఇమేజ్ మరింత బలపడటమే కాకుండా సినిమా స్థాయి కూడా అమాంతం పెరుగు తుంది. సీనియర్ హీరోల మాస్ ఇమేజ్ను బేస్ చేసుకుని రాబోతున్న సరికొత్త ప్రయోగాలు టాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.