రాజమౌళి హీరో కంటే తక్కువ తీసుకున్నాడా?

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో ఆయన తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది.;

Update: 2026-02-06 10:11 GMT

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు వారణాసి మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో ఆయన తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్టు షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది చిత్రీకరణ మొదలవ్వగా.. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం జక్కన్న కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో గ్లోబ్ ట్రాటింగ్ కాన్సెప్ట్ తో రానున్న వారణాసి.. సుమారు రూ.1300 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం. విజువల్ వండర్ గా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా సినిమా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు రెమ్యూనరేషన్ డిటైల్స్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ముఖ్యంగా జక్కన్నకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక.. ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఇప్పటికే టాక్ వచ్చింది. అంతే కాదు.. ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ టైమ్ లో ఏకంగా హీరోల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అది జక్కన్న క్రేజ్ అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో జోరుగా చర్చ కూడా జరిగింది.

దీంతో ఇప్పుడు వారణాసి మూవీకి కూడా హీరో కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మహేష్ బాబు కన్నా తక్కువే తీసుకుంటున్నట్లు కొందరు నెటిజన్లు అంటున్నారు. నిజానికి.. ఈసారి రాజమౌళి ఫిక్స్ డ్ రెమ్యూనరేషన్ కాకుండా వేరే స్ట్రాటజీ ఫాలో అవుతున్నట్లు కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వారణాసి మూవీకి రెమ్యునరేషన్ బదులు ఓవర్సీస్ రైట్స్‌ ను తీసుకున్నారని వినికిడి. వాటి వాల్యూ సుమారు రూ.160 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఆర్‌ఆర్‌ఆర్‌ కు అమెరికా సహా ఓవర్సీస్‌ లో రికార్డు స్థాయి వసూళ్లు రావడంతో, రాజమౌళి బ్రాండ్‌ కు అంతర్జాతీయ స్థాయిలో మంచి మార్కెట్ ఏర్పడింది. అదే నమ్మకంతో ఈసారి ఓవర్సీస్ హక్కులను రెమ్యునరేషన్‌ గా తీసుకోవడం తెలివైన వ్యూహమని చెబుతున్నారు.

అయితే వారణాసి మూవీకి హీరో మహేష్ బాబు కూడా కేవలం నటుడిగానే కాకుండా పార్టనర్ గా కూడా ఉన్నారని సమాచారం. అంటే ఆయనకు లాభాల్లో షేర్ ఉండేలా ఒప్పందం కుదిరిందట. అంచనాల ప్రకారం ఆయన వాటా రూ.200 కోట్ల వరకు వెళ్లొచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కన చూసుకుంటే ఆయన కన్నా రాజమౌళికి తక్కువనే చెప్పాలి. ఏదేమైనా ఇవన్నీ వైరల్ అవుతున్న వార్తలే. ఇందులో నిజమెంత అనేది మేకర్స్ కే తెలియాలి.

Tags:    

Similar News