స‌మాజంలోని ఎవ‌రూ చూపించ‌ని స‌మ‌స్యను చూపించారు

ఈ సినిమా థియేట్రిక‌ల్, నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ని ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.;

Update: 2025-12-22 23:30 GMT

``సమాజంలో ఉన్న ఒక ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌ను .. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్ ని ఎంతో ఎమోష‌న‌ల్ కంటెంట్ తో ద‌ర్శ‌కుడు తెర‌పై చూపించార‌``ని అన్నారు నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ. కలర్ ఫొటో, బెదురులంక 2012 లాంటి వైవిధ్య‌మైన‌ చిత్రాల‌ను నిర్మించి హృదయాల‌ను గెలుచుకున్న ఆయ‌న నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌య‌త్న‌మిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ఇందులో న‌టీన‌టులు. మురళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ చిత్రాన్నిడిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

ముంద‌స్తు అంచ‌నాల‌తో విడుద‌ల‌వుతున్న `దండోరా` కంటెంట్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు.. ఈరోజు సాయంత్రం జ‌రిగిన ప్ర‌చార కార్య‌క్ర‌మంలో న‌టీన‌టులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌హా చిత్ర‌బృందం పాల్గొంది. ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అనీల్ రావిపూడి.. వైవిధ్య‌మైన‌ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. తెలంగాణ మట్టివాస‌న‌తో కూడిన కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా క‌చ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సామాజిక సమస్యలను హృద్యంగా చూపిస్తూ, ప్రేక్షకులకు ఊహించని అనుభూతిని అందించనుంద‌ని అన్నారు.

ఈ సినిమా థియేట్రిక‌ల్, నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ ని ఇప్ప‌టికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఆంధ్ర‌, సీడెడ్, క‌ర్ణాట‌క ఏరియాల్లో ప్రైమ్ షో విడుదల చేయ‌నుంది. ఓవ‌ర్సీస్‌లో 200కు పైగా థియేట‌ర్స్‌లో అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ విడుదల చేస్తోంది.

Tags:    

Similar News