స్టార్ హీరో-ప్రొడ్యూసర్ కు ఓటీటీ షాక్ తప్పదా?
కానీ థియేట్రికల్ రిలీజ్ లో అవాంతరాలు ఎదురవ్వడం...తాజా పరిణామాల నేపథ్యంలో సినిమా రిలీజ్ అవ్వదని ఆమెజాన్ కూడా అంచనాకి వచ్చేస్తుందిట.;
కార్తీ హీరోగా నటించిన `వా వాతయార్` తెలుగులో `అన్నగారు వస్తున్నారు` టైటిల్ తో అనువాదామైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విషయంలో తలెత్తిన వివాదం విధితమే. పైనాన్సర్లకు, పంపిణీదారులకు నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా పాత బాకాయిలు క్లియర్ చేయడంలో విఫలమవ్వడంతో తాత్కాలికంగా రిలీజ్ ఆపాలంటూ హైకోర్టు స్టే విధించడం, అనంతరం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం? అక్కడా ఎదురు దెబ్బ తగలడం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ సందర్భంగానైనా డిసెంబర్ 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసారు. కానీ అత్యున్నత స్థానం లో కూడా చుక్కెదురైంది.
ఈ నేపథ్యంలో సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించలేదు. సరిగ్గా ఇదే సమయంలో డిజిటల్ రైట్స్ ను రద్దు చేసుకోవడానికి అమెజాన్ ప్రైమ్ సిద్దమవు తుందన్నది తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రైట్స్ ను అమెజాన్ భారీ ధరకు చేజిక్కించుకుంది. పోటీగా ఎన్నో ఓటీటీలు ఉన్నా? వాటన్నింటిని వెనక్కి నెట్టి ఫ్యాన్స్ ధర ఆపర్ చేసి హక్కులు పొందారు. కానీ థియేట్రికల్ రిలీజ్ లో అవాంతరాలు ఎదురవ్వడం...తాజా పరిణామాల నేపథ్యంలో సినిమా రిలీజ్ అవ్వదని ఆమెజాన్ కూడా అంచనాకి వచ్చేస్తుందిట. దీంతో ఒప్పందం రద్దు దిశగా ఆలోచన చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
థియేట్రికల్ రిలీజ్ జరగనిదే ఓటీటీ రిలీజ్ అవకాశం ఉండదు. ఓటీటీ థియేట్రికల్ రిలీజ్ స్లాట్ ఇచ్చిన తర్వాతే? థియేట్రికల్ రిలీజ్ తేదీ ప్రకటిస్తుంటారు. థియేట్రికల్ రిలీజ్-ఓటీటీ రిలీజ్ మద్య కొంత సమయం ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారం ఓటీటీ డీల్ కుదుర్చుకుంటుంది. థియేట్రికల్ రిలీజ్ అన్నది ఓ ప్రణాళిక ప్రకారం జరిగితే ఓటీటీ రిలీజ్ కు క్లియరెన్స్ ఉంటుంది. ప్రకటించిన టైమ్ కి స్ట్రీమింగ్ కి అవకాశం ఉంటుంది. ప్రమోషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ `వా వాతయార్` బకాయిలు క్లియర్ అయ్యే వరకూ గానీ కోర్టు అనుమతి ఇవ్దదని భావించిన అమెజాన్ సంస్థ? ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడమే ఉత్తంగా భావిస్తోందిట.
ఇదే జరిగితే నిర్మాత జ్క్షాన్ వేల్ రాజాకు మరో బిగ్ షాక్ తప్పదు. నిర్మాతగా ఆయన ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారు. సూర్య నటించిన `కంగువ`ను పాన్ ఇండియాలో రిలీజ్ చేసి నష్టాల పాలయ్యారు. కార్తీ-సూర్యలతో జ్ఞాన్ వేల్ రాజా ఎన్నో సినిమాలు నిర్మించారు. అన్నదమ్ములిద్దరికీ స్టూడియో గ్రీన్ సంస్థ అంటే హోం బ్యానర్ లాంటింది. అలాంటి సంస్థ నేడు ఆర్దిక ఇబ్బందుల్లో పడింది. బ్యాకెండ్ లో అన్నదమ్ములిద్దరు అందించాల్సిన సహాయం అందిస్తున్నారు. కానీ ఆ బ్యాకప్ సరిపోవడం లేదు.