బిగ్ బాస్ 9 సీజన్ల విన్నర్స్ ఎవరు.. ఏం చేస్తున్నారు..?
బిగ్ బాస్ షో నడిచినంతసేపు ఆ టైటిల్ విన్నర్స్ గురించి ఆడియన్స్ బాగా హైప్ ఎక్కిస్తారు. అది చూసుకుని మనం కూడా స్టార్స్ అయ్యామని భావిస్తే మాత్రం చాలా పెద్ద నష్టం జరుగుతుంది.;
బిగ్ బాస్ రియాలిటీ షోకి తెలుగులో మంచి ఆదరణ లభిస్తుంది. హాలీవుడ్ లో బిగ్ బ్రదర్ షోని ఎండమోల్ వాళ్లు ఇండియన్స్ కి బిగ్ బాస్ రియాలిటీ షోగా పరిచయం చేశారు. హిందీలో మొదట స్టార్ట్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో 2017లో మొదటి సీజన్ మొదలైంది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ తెలుగు షో ఇప్పటికే 9 సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ మాత్రమే ఎన్ టీ ఆర్ హోస్ట్ గా చేయగా బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. ఇక థర్డ్ సీజన్ అంటే 2020 నుంచి జరిగిన 9వ సీజన్ వరలు కింగ్ నాగార్జున హోస్ట్ గా చేశారు.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్లలో తొమ్మిది మంది టైటిల్ విన్నర్స్ అయ్యారు. మొదటి సీజన్ నుంచి తెలుగు ఆడియన్స్ కి ఈ షో బాగా నచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ విన్నర్ శివ బాలాజీ కాగా రెండో సీజన్ కౌశల్ మండ విన్ అయ్యాడు. థర్డ్ సీజన్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విజేత అయ్యాడు. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ అభిజిత్, ఐదో సీజన్ వీజే సన్నీ విజేతలుగా నిలిచారు. ఆరో సీజన్ పల్లవి ప్రశాంత్, ఏడవ సీజన్ రేవంత్ విన్ అయ్యారు. ఇక ఎనిమిదవ సీజన్ నిఖిల్ రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాల నిలిచాడు.
ఐతే బిగ్ బాస్ షో నడిచినన్నాళ్లు అందులో ఉన్న కంటెస్టెంట్స్ ముఖ్యంగా టైటిల్ విన్నర్స్ కి సూపర్ క్రేజ్ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్లు టైటిల్ గెలుచుకుని బయటకు వస్తారో వారిలో కొందరు ఈ క్రేజ్ ని కెరీర్ కి సపోర్ట్ చేసేలా టర్న్ చేసుకుంటారు. కొందరు అలానే ఉండిపోతారు.
బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివ బాలాజీ అప్పటికే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నాడు. బిగ్ బాస్ తర్వాత అతని కెరీర్ ఆశించిన రేంజ్ లో అయితే టర్న్ తీసుకోలేదు. బిగ్ బాస్ తో వచ్చిన ఫాలోయింగ్ తో స్నేహమేరా జీవితం అనే సినిమాను నటించి నిర్మించాడు. కానీ అది ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత కెరీర్ లో మంచి బ్రేక్ కూడా రాలేదు. ఈమధ్యనే శివ బాలాజీ మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటించాడు.
బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ మండ నిలిచాడు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వచ్చిన కౌశల్.. సీజన్ 2లో తన మార్క్ చూపించాడు. ఈ సీజన్ టైంలో కౌశల్ కి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కౌశల్ ఆర్మీ అంటూ కౌశల్ ఫ్యాన్స్ బాగా హడావిడి చేశారు. ఐతే టైటిల్ విన్నర్ అయిన కౌశల్ ఆ తర్వాత ఎందుకో పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత బిగ్ బాస్ ఈవెంట్స్ లో కూడా కౌశల్ అసలు ఎంట్రీ ఇవ్వలేదు. బిగ్ బాస్ టీం తో కౌశల్ డిస్టన్స్ కి రీజన్స్ ఏంటో తెలియదు. ఐతే కెరీర్ పరంగా కూడా కౌశల్ తన మోడలింగ్ ఏజెన్సీ కొనసాగిస్తున్నాడు.
సీజన్ 3 విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్.. అప్పటికే సింగర్ గా మంచి ఫాం లో ఉన్న అతను బిగ్ బాస్ టైటిల్ విజేతగా మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ క్రేజ్ తో ప్రైవేట్ ఆల్బంస్ చేస్తూ నాటు నాటు సాంగ్ తో అకాడమీ అవార్డ్ కూడా వచ్చేలా చేసుకున్నాడు. బిగ్ బాస్ విన్నర్ అయ్యి కెరీర్ లో కూడా సూపర్ సక్సెస్ అయిన వారిలో రాహుల్ పేరు ముందుంటుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో టైటిల్ విన్నర్ అయ్యాడు అభిజిత్. హీరోగా పెద్దగా ఫాం లో లేని అతను సీజన్ 4లో తన కూల్ అండ్ కాంపోజింగ్ తో ఏకంగా టైటిల్ అందుకున్నాడు. ఐతే బిగ్ బాస్ విన్నర్ అయ్యాక కూడా అభిజిత్ కెరీర్ లో పెద్దగా పుష్ రాలేదు. బిగ్ బాస్ సీజన్ 9 కోసం కామనర్స్ ని సెలెక్ట్ చేసేందుకు బిగ్ బాస్ అగ్నిపరీక్ష హోస్ట్ గా మళ్లీ కనిపించాడు అభిజిత్. అతను మంచి ట్రావెలర్.. సినిమాలు చేయడం అటు పక్కన పెడితే వరల్డ్ టూర్స్, డిఫరెంట్ బైక్, వెహికల్స్ ఎక్స్ పీరియన్స్ ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా వీజే సన్నీ నిలిచాడు. అతనెవరో పెద్దగా తెలియకపోయినా తన ఆట తీరుతో అందరినీ అలరించి విజేతగా నిలిచాడు సన్నీ. సన్నీ కూడా బిగ్ బాస్ విన్నర్ అయ్యాక 2, 3 సినిమాలు చేశాడు. ఐతే అవేవి పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఒక ప్రైవేట్ బిజినెస్ స్టార్ట్ చేసి కెరీర్ లో మంచి ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నాడు సన్నీ.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. ఆ సీజన్ లో శ్రీహాన్ తో అతనికి గట్టి పోటీ ఏర్పడింది. రేవంత్, శ్రీహాన్ టాప్ 2 గా ఉండగా 40 లక్షల ప్రైజ్ మనీతో శ్రీహాన్ బయటకు వచ్చాడు. దాని వల్ల రేవంత్ టైటిల్ గెలిచాడు. బిగ్ బాస్ కి వెళ్లకముందే రేవంత్ మంచి సింగర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆఫ్టర్ బిగ్ బాస్ తన ప్లే బ్యాక్ సింగింగ్ తో అలరిస్తున్నాడు. ఐతే బిగ్ బాస్ వల్ల అతనికి పెద్దగా ఉపయోగపడింది అయితే ఏమి లేదని కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ తెలుగులో సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఆ సీజన్ లో సెలబ్రిటీస్ తో పాటు కామనర్ గా వచ్చాడు ప్రశాంత్. హౌస్ లో తనని ఒంటరివాడిని చేసి సెలబ్రిటీస్ అంతా కూడా ఆట ఆడుతున్నాడని ఆడియన్స్ లో సింపతీ గైన్ చేసుకున్న ప్రశాంత్ ఫైనల్ గా సీజన్ విన్నర్ అయ్యాడు. ఐతే టైటిల్ గెలిచిన అతను ఆ రాత్రి రోడ్ షో చేయడం వల్ల పోలీసులు అరెస్ట్ చేసి 15 రోజులు జైలులో ఉంచారు. ఆ తర్వాత ప్రశాంత్ కి సెలబ్రిటీ హోదా రావడంతో దాని వల్ల ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అతను రైతుబిడ్డ అని చెప్పి ఆ సెంటిమెంట్ తో ఆడియన్స్ నుంచి భారీ ఓటింగ్ తెచ్చుకున్నాడు. రైతు బిడ్డ సెంటిమెంట్ ప్రశాంత్ కి బాగా వర్క్ అవుట్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత అతన్ని ఎవరు పట్టించుకోవట్లేదు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో సీరియల్ యాక్టర్ నిఖిల్ విన్ అయ్యాడు. నిఖిల్ తో పాటు రేసులో గౌతం కృష్ణ టాప్ 2గా ఉన్నాడు. సీరియల్ వల్ల వచ్చిన ఇమేజ్ తో పాటు హౌస్ లో తన ఆటతో ఆడియన్స్ చేత విజేత కాబడ్డాడు నిఖిల్. ఐతే నిఖిల్ ఆఫ్టర్ బిగ్ బాస్ స్టార్ మా షోస్ లో తప్ప పెద్దగా కనిపించలేదు. సీరియల్ యాక్టర్ కాబట్టి అతనికి సీరియల్స్ లోనే మంచి కెరీర్ ఉండే ఛాన్స్ ఉంది.
ఇక సీజన్ 9 రీసెంట్ గా పూర్తైంది. ఈ సీజన్ లో కళ్యాణ్ పడాల టైటిల్ విజేతగా నిలిచాడు. కామనర్ కేటగిరిలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి వచ్చిన కళ్యాణ్ సీజన్ విన్నర్ అవ్వడం సర్ ప్రైజ్ చేసింది. ఐతే ఆర్మీ మ్యాన్ అయిన కళ్యాణ్ తన డ్రీం యాక్టర్ అవ్వడమని చెప్పాడు. సో బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీతో అతను యాక్టర్ గా ఛాన్స్ లు తెచ్చుకుంటాడని చెప్పొచ్చు.
బిగ్ బాస్ షో నడిచినంతసేపు ఆ టైటిల్ విన్నర్స్ గురించి ఆడియన్స్ బాగా హైప్ ఎక్కిస్తారు. అది చూసుకుని మనం కూడా స్టార్స్ అయ్యామని భావిస్తే మాత్రం చాలా పెద్ద నష్టం జరుగుతుంది. బిగ్ బాస్ క్రేజ్ ని వాడుకుని కెరీర్ కి ఉపయోగపడేలా చేసుకోవాలే తప్ప అదే స్టార్ స్టేటస్ అనుకుంటే మాత్రం అబాసుపాలవ్వక తప్పదు.