సంక్రాంతి బ‌రిలో బాబాయి- అబ్బాయి క్లాష్?

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌లో భారీ సినిమాల పోటీకి వేదికనే చెప్పాలి.;

Update: 2026-03-05 09:49 GMT

సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్‌లో భారీ సినిమాల పోటీకి వేదికనే చెప్పాలి. ప్రతి ఏడాది లాగే 2027 సంక్రాంతి కూడా ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు సాక్ష్యమివ్వబోతుందనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ముఖ్యంగా నందమూరి అభిమానుల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ క్లాష్ జరిగే అవకాశం ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌ హీరోగా, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా సంక్రాంతి 2027 సంక్రాంతి టార్గెట్ గా రూపొందుతున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన వీర సింహారెడ్డి కూడా సంక్రాంతికి వ‌చ్చి మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్టుపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను కూడా గోపీచంద్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

నంద‌మూరి ఫ్యాన్స్ మ‌ధ్య ఇంట్రెస్టింగ్ పోరు

ఇదిలా ఉంటే మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంక‌టేష్ ద‌గ్గుబాటి, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమా కూడా సంక్రాంతి 2027 బరిలోకి రావడానికి రెడీ అవుతుంద‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు ప్రత్యేక గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా ఎంట‌ర్టైన్మెంట్ ప్ర‌ధానంగానే తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు సినిమాలూ నిజంగా సంక్రాంతి సీజ‌న్ లోనే రిలీజైతే నందమూరి అభిమానుల మధ్య ఒక ఆసక్తికర పరిస్థితి ఏర్పడే అవకాశముంది. ఒకవైపు బాలకృష్ణ సినిమా ఉండగా, మరోవైపు అదే నందమూరి కుటుంబానికి చెందిన కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ‌వ‌డం వల్ల బాక్సాఫీస్ వద్ద ప్రత్యేకమైన పోటీ కనిపించవచ్చు.

ఎన్టీఆర్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం

ఇలాంటి సిట్యుయేష‌న్ లో జూ. ఎన్టీఆర్ కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం లేక‌పోలేదు. మామూలుగా త‌న అన్న క‌ళ్యాణ్ రామ్ నుంచి వ‌చ్చే సినిమాల ప్ర‌మోష‌న్స్ లో ఎన్టీఆర్ పాల్గొని ఆ సినిమాను ప్ర‌మోట్ చేస్తుంటార‌నే విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్ప‌టికే ప‌లు సినిమాల ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌కు తార‌క్ వ‌చ్చి క‌ళ్యాణ్ రామ్ కు త‌న స‌పోర్ట్ అందించారు. రాబోయే సినిమాకు కూడా ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా హాజ‌రైతే ఈ సినిమా బ‌జ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్ల‌డం ఖాయం. అస‌లే మ‌ల్టీస్టార‌ర్ బ‌జ్, అనిల్ క్రేజ్ తో పాటూ ఎన్టీఆర్ గెస్ట్ గా కూడా రావ‌డం జ‌రిగితే ఈ సినిమాకు హైప్ భారీగా వ‌స్తుంది.

ఒక‌వేళ ఎన్టీఆర్ ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌క‌పోయినా, క‌ళ్యాణ్ రామ్ సినిమాకు తార‌క్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ స‌పోర్ట్ ద‌క్కే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి ఫ్యాన్స్ రెండు వర్గాలుగా విడిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుందా అనే ప్ర‌శ్న కూడా మొద‌లైంది. అయితే సంక్రాంతి టైమ్ లో పెద్ద సినిమాల మ‌ధ్య పోటీ కొత్త విష‌య‌మేమీ కాదు, గతంలో కూడా ప‌లుమార్లు భారీ సినిమాలు ఒకేసారి రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్ అయిన సంద‌ర్భాలున్నాయి. కానీ ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్ద‌రు హీరోలు సంక్రాంతి బ‌రిలో నిలుస్తార‌నే వార్త అంద‌రినీ ఎగ్జైట్ చేస్తోంది. ఒక‌వేళ అదే జ‌రిగితే నంద‌మూరి ఫ్యాన్స్ కు ఇదొక స్పెష‌ల్ బాక్సాఫీస్ సీజ‌న్ గా మారే అవ‌కాశ‌ముంది.

Tags:    

Similar News