తోబుట్టువులు త‌ల్లిదండ్రులే వేధించారు.. యూట్యూబ‌ర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!

ప్రముఖ యూట్యూబర్.. బిగ్ బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభాల్ (యూకే07 రైడ‌ర్) తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన విషయాలు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.;

Update: 2026-03-05 12:53 GMT

ప్రముఖ యూట్యూబర్.. బిగ్ బాస్ 17 ఫేమ్ అనురాగ్ దోభాల్ (యూకే07 రైడ‌ర్) తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన విషయాలు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాను తీవ్రమైన మానసిక వేధింపులకు, టార్చర్‌కు గురవుతున్నానని.. తనను ఇబ్బంది పెట్టిన వారి పేర్లను త్వరలోనే బయటపెడతానని గతంలోనే హింట్ ఇచ్చిన అనురాగ్ తాజాగా ఒక వీడియోను విడుదల చేశారు. దీనిని తన చివరి వీడియోగా పేర్కొంటూ.. తనను మానసికంగా కుంగదీసింది మరెవరో కాదు.. తన సొంత తల్లిదండ్రులు.. తోబుట్టువులేనని సంచలన ఆరోపణలు చేశారు.

తన పెళ్లికి కేవలం ఆరు రోజుల ముందు తన తల్లిదండ్రులు పెళ్లికి రావడానికి నిరాకరించారని.. మొత్తం వేడుకను తానొక్కడినే మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించారని అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను అందరి ముందు చేతులు జోడించి క్షమాపణలు చెప్పేలా చేశారు.. కాళ్లు మొక్కేలా చేసారు. నా తల్లిదండ్రులు నన్ను ఏ స్థాయిలో టార్చర్ చేశారంటే.. మేము సంతోషంగా ఉండము.. నిన్ను కూడా సంతోషంగా ఉండనివ్వము అని తెగేసి చెప్పారు! అంటూ అనురాగ్ తన గోడును వెళ్లగక్కారు.

కులాంత‌ర వివాహం కార‌ణ‌మా?

తాను వేరే కులానికి చెందిన అమ్మాయి (రితికా)ని వివాహం చేసుకోవడమే ఈ గొడవలకు కారణమని ఆయన పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకు తన తల్లిదండ్రులు ఈ బంధాన్ని అంగీకరించలేదని, తనను, రితికను ఇంట్లోకి కూడా రానివ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలో జరిగిన అవమానాలు, వేధింపులు భరించలేక తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఆయన వెల్లడించడం యూట్యూబ్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అనురాగ్ పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవంతమైన యూట్యూబర్‌గా కోట్లాది మందిని అలరిస్తున్నా కానీ.. వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఈ కుటుంబ కలహాలు అతడిని మానసిక స్థితిని దెబ్బతీశాయి. కులం పేరుతో సొంత బిడ్డను వేధించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

భారతదేశంలోని టాప్ యూట్యూబర్ల మానసిక వ్యధ:

ఇటీవలి కాలంలో భారతదేశంలోని టాప్ 5 యూట్యూబర్లు (అనురాగ్ దోభాల్, ఎల్విష్ యాదవ్, అర్మాన్ మాలిక్ వంటి వారు) భారీ ఫాలోయింగ్ సంపాదించినా కానీ, తెర వెనుక తీవ్రమైన మానసిక కలతలను ఎదుర్కొంటున్నారు. నిరంతరం కంటెంట్ క్రియేట్ చేయాలనే ఒత్తిడి, సోషల్ మీడియాలో వచ్చే విపరీతమైన ట్రోలింగ్, వ్యక్తిగత జీవితం బహిర్గతం కావడం వల్ల వీరి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోంది. ముఖ్యంగా అనురాగ్ దోభాల్ వంటి వారు తమ కుటుంబ సమస్యలను పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై పెట్టడం.. అనుభవిస్తున్న తీవ్రమైన మనోవేదనకు అద్దం పడుతోంది. వెండితెర స్టార్ల కంటే ఎక్కువగా ప్రజల్లో ఉండే ఈ యూట్యూబర్లు, ప్రతి చిన్న విషయంలోనూ నెగిటివిటీని ఎదుర్కోవాల్సి రావడం వారిని డిప్రెషన్‌లోకి నెడుతోంది.

సక్సెస్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఇలాంటి మానసిక కుంగుబాటుకు గురవ్వడం ఏఐ (AI) యుగంలో ఒక చర్చనీయాంశంగా మారింది. డబ్బు, పేరు ఉన్నా కానీ.. కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవడం, ఆన్-లైన్ వేధింపులు వీరిని ఒంటరిని చేస్తున్నాయి. అనురాగ్ దోభాల్ ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లడం అనేది డిజిటల్ క్రియేటర్ల మానసిక ఆరోగ్యంపై సమాజం, పరిశ్రమ దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కేవలం సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ మాత్రమే కాకుండా ఈ వృత్తిలో ఉన్నవారు ఎదుర్కొనే ఒత్తిళ్లు తీవ్రమైన మానసిక అస్థిరతకు గురిచేస్తున్నాయి.


Full View


Tags:    

Similar News