పెళ్లి ప్ర‌య‌త్నాల్లో పూజాహెగ్డే త‌ల్లితండ్రులు!

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే వృత్తిగ‌త జీవితం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ నుంచి సౌత్ కి మ‌ళ్లీ కంబ్యాక్ అయిన త‌ర్వాత ఒక్కొక్క‌టిగా అవ‌కాశాలు అందుకుంటుంది.;

Update: 2026-03-05 08:32 GMT

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే వృత్తిగ‌త జీవితం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ నుంచి సౌత్ కి మ‌ళ్లీ కంబ్యాక్ అయిన త‌ర్వాత ఒక్కొక్క‌టిగా అవ‌కాశాలు అందుకుంటుంది. టాలీవుడ్ ప‌క్క‌న బెట్టినా కోలీవుడ్ మాత్రం అక్కున చేర్చుకుని ఆద‌రిస్తుంది. ఈ క్ర‌మంలోనే పూజాహెగ్డే పేరు మీడియాలో వైర‌ల్ అవుతుంది. లేదంటే? అమ్మ‌డు పేరు క‌నుమ‌రుగైపోయేది. కోలీవుడ్ అవ‌కాశాల‌తో మెల్ల‌గా మ‌ళ్లీ టాలీవుడ్ లోనూ బిజీ అవ్వాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. పాత ప‌రిచ‌యాల‌తో మ‌ళ్లీ అవ‌కాశాలు అందుకునే చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇదంతా ప్రోపెష‌న‌ల్ లైఫ్.

మ‌రి అమ్మ‌డి వ్య‌క్తిగ‌త జీవితం ఎలా ఉంది? అంటే ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. పూజాహెగ్డే కి త‌ల్లిదండ్రులు పెళ్లి కొడుకుని వెతికే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. అమ్మ‌డి వ‌య‌సు ఇప్ప‌టికే 35 ఏళ్లు నిండ‌టంతో పెళ్లి చేసుకోమని ఇంట్లో త‌ల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారుట‌. కొన్ని నెల‌ల‌లుగా ఈ ఒత్తిడి మొద‌లైన నేప‌థ్యంలో తాజాగా పెళ్లి విష‌యంలో సంబంధాలు చూడండ‌ని చెప్పిందిట‌. డాడ్ మంజునాధ్ హెగ్డే..మామ్ ల‌తా హెగ్డే ఓ పెద్ద‌ వ్యాపారవేత్త కుటుంబం నుండి సంబంధాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ముంబైకి చెందిన బిజినెస్‌మెన్‌తో ఆమె పెళ్లి ఉండవచ్చని వార్త‌లొస్తున్నాయి.

మ‌రి ఈ ప్ర‌చారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పూజాహెగ్డే మ‌న‌సులో ఎవ‌రైనా ఉన్నారా? ల‌వ్..రిలేష‌న్ షిప్ అంటూ కొంద‌రి పేర్లు గ‌తంలోనే తెర‌పైకి వ‌చ్చాయి. దివంగ‌త న‌టుడు నవినోద్ మోహ్రా కుమారుడు, న‌టుడు రోహన్ మెహ్రా స‌న్నిహితంగా ఉంటుంద‌నే ప్రచారం జ‌రిగింది. వీరిద్దరూ పలుమార్లు ముంబైలో కెమెరా కంటికి చిక్కారు. 2024 ఏప్రిల్‌లో పూజా తల్లిదండ్రులతో కలిసి రోహన్ లంచ్‌కు వెళ్లడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అటుపై `కిసీకా భాయ్ కిసీకా జాన్` షూటింగ్ స‌మ‌యంలో స‌ల్మాన్ ఖాన్ తోనూ ప్రేమ‌లో ఉంద‌నే ప్ర‌చారం జ‌రిగింది.

పూజాహెగ్డే సోద‌రుడు రిష‌బ్ హెగ్డే పెళ్లికి స‌ల్మాన్ అటెండ్ అవ్వ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. అలాగే కర్ణాటకకు చెందిన ఓ క్రికెటర్‌ను పెళ్లాడుతుంద‌నే క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. చివ‌రిగా బాలీవుడ్ యువ న‌టుడు ఇషాన్ క ట్ట‌ర్ తోనూ అమ్మ‌డు స‌న్నిహితంగా దిగిన ఫోటోలు ఎన్నో సందేహాల‌కు తావిచ్చాయి. ఇద్ద‌రు కలిసి ట్రిప్పులకు వెళ్లడం, సరదాగా గడపడం వంటివి చూసి సంథింగ్ సంథింగ్ న‌డుస్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ ప్ర‌చారాల‌పై పూజాహెగ్డే ఏనాడు స్పందించ‌క‌పోవ‌డంతో? ఇవ‌న్నీ క‌ల్పిత క‌థ‌నాల‌గా బాలీవుడ్ మీడియా తుదిగా పేర్కొంది. ప్ర‌స్తుతం పూజాహెగ్డే త‌మిళ‌, హిందీలో క‌లిపి నాలుగు సినిమాల్లో న‌టిస్తోంది. వీటిలో దుల్కార్ స‌ల్మాన్ హీరోగా ఓ తెలుగు సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్ గా పూజాహెగ్డే ఎంపిక‌వ్వ‌డం విశేషం.

Tags:    

Similar News