'శ్రీ విష్ణు' పవర్.. ఆరు రోజుల్లోనే టార్గెట్ కంప్లీట్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు మరోసారి తన స్టార్ పవర్ ను ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు మరోసారి తన స్టార్ పవర్ ను ప్రూవ్ చేసుకున్నారని చెప్పాలి. మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన స్టోరీలు, నేచురల్ యాక్టింగ్, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయన నటించిన తాజా చిత్రం విష్ణు విన్యాసం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను సాధిస్తూ సందడి చేస్తోంది.
సినిమాకు స్టార్టింగ్ లో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. క్రమంగా పుంజుకుని నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. మూవీ రిలీజ్ కు ముందు కొన్ని సన్నివేశాలు లీక్ కావడం, మొదటి రోజు ఉదయం షోల నుంచి మిక్స్ డ్ టాక్ రావడం వంటి ఇబ్బందులు ఎదురైనా, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గలేదు. కుటుంబ ప్రేక్షకులు, యూత్ పెద్ద ఎత్తున థియేటర్లకు రావడం ప్లస్ అయింది.
దీంతో విష్ణు విన్యాసం మూవీ.. ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిందని మేకర్స్ తాజాగా వెల్లడించారు. స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసి సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. తొలి ఆరు రోజుల్లోనే రూ.19.2 కోట్లకు పైగా సినిమా గ్రాస్ వసూళ్లు సాధించిందని ప్రకటించారు. ఇప్పుడు ఆ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోస్టర్ కూడా సూపర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. డైరెక్టర్ యదునాథ్ మారుతి రావు కథను సరదాగా రాసుకుని మూవీని తెరకెక్కించగా, నిర్మాత సుమంత్ జి నాయుడు నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసిన సన్నివేశాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ అసెట్ గా మారింది. కమెడియన్ సత్యతో ఆయన కలిసిన సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే హీరోయిన్ నయన్ సారికతో రొమాంటిక్ ట్రాక్ యూత్ ను ఆకట్టుకుంది. ఫన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. మొదటి రోజు స్లోగా స్టార్ట్ అయినా, మౌత్ టాక్‌తో కలెక్షన్లు రోజురోజుకీ పెరగడం చిత్రానికి ప్లస్ అయ్యింది.
సెలవు రోజుల్లో థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం నిర్మాతలకు మరింత ఊరటనిచ్చింది. ప్రీరిలీజ్ బిజినెస్ కూడా సేఫ్ జోన్‌లో ఉండటంతో, ఇప్పటికే మూవీ లాభాల్లోకి వెళ్లింది. ఇటీవల కాలంలో వరుసగా ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో విజయాలు సాధిస్తున్న శ్రీ విష్ణు.. కంటెంట్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోగా పేరు తెచ్చుకున్నారు. స్టోరీ సెలక్షన్ లో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలే.. హిట్స్ అందుకోవడం వెనుక ప్రధాన కారణమని అంతా చెబుతున్నారు. మరి అప్ కమింగ్ మూవీస్ తో శ్రీవిష్ణు.. ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.