రవితేజ కొత్త లుక్.. ఆ డిస్కషన్ ఏంటి?
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు తన కొత్త లుక్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.;
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు తన కొత్త లుక్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. సాధారణంగా ఎనర్జీతో నిండిన బాడీ లాంగ్వేజ్, ఫిట్ నెస్, యంగ్ లుక్ తో కనిపించే రవితేజ ఈసారి మాత్రం చాలా సన్నగా కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆయన లుక్ కోసం ఇప్పుడు నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇటీవల జరిగిన యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమానికి రవితేజ హాజరయ్యారు. ఆ వేడుకకు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు కూడా వచ్చారు. అయితే అందరి దృష్టి ఎక్కువగా ఆకర్షించింది రవితేజనే. ఆయన చాలా స్లిమ్ గా, ముందుతో పోలిస్తే బరువు తగ్గినట్లు కనిపించడంతో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా రవితేజ సినిమాల్లో ఫుల్ యాక్టినెస్ తో కూడిన పాత్రల్లో, మాస్ యాక్షన్ సన్నివేశాల్లో జోష్ తో కనిపిస్తుంటారు. అలాంటి హీరో ఒక్కసారిగా అంత సన్నగా కనిపించడం చూసి అభిమానులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోకు హెల్త్ బాలేదా లేక కొత్త సినిమా కోసం సన్నగా మారారా అంటూ అనేక మంది క్వశ్చన్ చేస్తున్నారు.
అయితే సినిమా కోసమే రవితేజ బాగా స్లిమ్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ఇరుముడి కోసం రవితేజ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారని సమాచారం. ఆ సినిమాలో ఆయన ఇప్పటి వరకు చేయని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారట. కథకు అనుగుణంగా సన్నగా, నేచురల్ లుక్ అవసరం కావడంతో స్ట్రిక్ట్ డైట్, స్పెషల్ వర్కౌట్స్ చేసి బాగా బరువు తగ్గారని టాక్ నడుస్తోంది.
నిజానికి.. శివ నిర్వాణ సినిమాలు భావోద్వేగాలతో నిండిన కథలు, సహజమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాంటి దర్శకుడితో రవితేజ సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అందుకే ఇరుముడి సినిమాకు గాను ప్రత్యేకమైన లుక్ ట్రై చేయాలని రవితేజ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే నటుడిగా ఆయనకు ఇప్పటికే మంచి పేరు ఉన్న సంగతి తెలిసిందే.
గతంలో కూడా కొన్ని సినిమాల కోసం గెటప్ మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరుముడి విషయంలో కూడా అంతేనని తెలుస్తోంది. ఏదేమైనా శిరీష్ మ్యారేజ్ ఈవెంట్ లో రవితేజను చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా చాలా సన్నబడ్డారని ఆయనతో అన్నట్లు సమాచారం. మరోవైపు అభిమానులు మాత్రం మాస్ మహారాజా ఎలాంటి లుక్ లో ఉన్నా సూపరహే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఇరుముడి మూవీలో ప్రేక్షకులు ఓ కొత్త రవితేజను చూడబోతున్నారని చెప్పవచ్చు.