సమంత సూపర్ ప్లానింగ్.. ఏడాది చివర్లోనే అది కూడా..?
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మన దగ్గర సినిమాలతోనే స్టార్ డం తెచ్చుకోగా నార్త్ సైడ్ మాత్రం వెబ్ సీరీస్ లతో అలరిస్తూ వచ్చింది.;
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత మన దగ్గర సినిమాలతోనే స్టార్ డం తెచ్చుకోగా నార్త్ సైడ్ మాత్రం వెబ్ సీరీస్ లతో అలరిస్తూ వచ్చింది. అప్పటివరకు సమంత హీరోయిన్ గా మాత్రమే చేస్తుంది అనుకున్న వారందరికీ ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ లో ఒక వెరైటీ రోల్ చేసి సర్ ప్రైజ్ చేసింది. సమంత లోని ఈ టాలెంట్ చూసిన బీ టౌన్ ఆడియన్స్ ఆమెకు ఫ్యాన్స్ గా మారిపోయారు. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ తోనే సిటాడెల్ సీరీస్ ని కూడా చేసింది సమంత. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సమంత చాలా కంఫర్టబుల్ గా సీరీస్ లు చేస్తుందని తెలుస్తుంది.
ఇదే కాదు సమంత నిర్మాణంలోకి అడుగు పెట్టింది. సమంత తొలి సినిమా శుభం ఈమధ్యనే రిలీజైంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత నిర్మాతగా చేసిన శుభం కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా నిర్మాతగా సక్సెస్ కి పేరు తెచ్చి పెట్టింది. ఐతే సమంత తన బ్యానర్ లో మొదట అనౌన్స్ చేసిన సినిమా మా ఇంటి బంగారం. ఆ సినిమాలో సమంత లీడ్ రోల్ గా నటిస్తుందని తెలుస్తుంది.
తుపాకి పట్టుకుని సమంత పోస్టర్ తో మా ఇంటి బంగారం సినిమా అనౌన్స్ చేశారు. ఐతే ఆ సినిమా ఏమైందో కానీ సడెన్ గా శుభం అంటూ కొత్త ప్రాజెక్ట్ తో వచ్చి ఆ సినిమాను గట్టిగా ప్రమోట్ చేసి నిర్మాతగా పర్వాలేదు అనిపించుకుంది సమంత. ఇక సమంత బ్యానర్ నుంచి వస్తున్న రెండో ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి కావొచ్చిందని తెలుస్తుంది.
సమంత ఈమధ్యనే మా ఇంటి బంగారం అప్డేట్స్ త్వరలో వస్తాయని అన్నది. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం సమంత ఈ సినిమాను కూడా ఇదే ఇయర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది. అన్నీ కుదిరితే ఈ ఇయర్ డిసెంబర్ లో ఆ సినిమాను వదిలేలా ప్లాన్ చేస్తున్నారట. సమంత నిర్మాతగా ఒకే ఇయర్ లో రెండు సినిమాలు రిలీజ్ చేయడం నిజంగానే గొప్ప విషయమని చెప్పొచ్చు. ఇక సమంత తన నిర్మాణంలో కాకుండా వేరే తెలుగు సినిమాలు ఎప్పుడు చేస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
స్టార్ సినిమాలకు పూర్తిగా దూరమైన సమంతని మళ్లీ స్టార్ కమర్షియల్ సినిమాల్లో చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆ ఛాన్స్ ఎవరు ఎప్పుడు ఇస్తారన్నది చూడాలి. సమంత మాత్రం నిర్మాతగా చేస్తున్న సినిమాల్లో తను కూడా భాగమై తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది.