కొత్త జ్ఞాపకాలు టాటూలుగా మారుతాయా?

దీంతో స‌మంత ఒంటిపై చైత‌న్య‌కు సంబంధించి ఇంకెలాంటి జ్ఞాప‌కాలు గానీ, గుర్తులు గానీ లేవు.;

Update: 2025-06-07 06:30 GMT

స‌మంత‌-నాగ‌చైత‌న్య ప్రేమ‌వివాహం చేసుకోవడం..అది వీగిపోవ‌డం తెలిసిందే. అటుపై చైత‌న్య జ్ఞాప‌కా ల‌ను ఒక్కొక్క‌టిగా చెరుపుకుంటూ వ‌స్తోంది. మ‌న‌సులో ఉన్న జ్ఞాప‌కంలో శ‌రీరంపై ఉన్న టాటూల రూపంలో గుర్తులు అన్నింటి ఒక్కొక్క‌టిగా చెరిపేస్తోంది. మొన్న‌టివ‌ర‌కూ మొడ కింద భాగంలో ఇద్ద‌రు క‌లిసి న‌టిం చిన తొలి చిత్రం `ఏమాయ చేసావే` అనే టాటూ ఉండేది. తాజాగా ఆ టాటూ కూడా సామ్ పూర్తిగా తొల‌గించింది.

దీంతో స‌మంత ఒంటిపై చైత‌న్య‌కు సంబంధించి ఇంకెలాంటి జ్ఞాప‌కాలు గానీ, గుర్తులు గానీ లేవు. ఈ నేప‌థ్యంలో చైత‌న్య జ్ఞాప‌కాల నుంచి స‌మంత పూర్తిగా బ‌య‌ట ప‌డ‌టానికి ఇదొక సంకేతం. అయితే స‌మంత కొంత కాలంగా రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉంది? అనే ప్ర‌చారం పెద్ద ఎత్తున జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు జంట‌గా క‌లిసి ఈవెంట్ల‌కు హాజ‌ర‌వ్వ‌డం...సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్ అవ్వ‌డం వంటివి జ‌రుగుతున్నాయి.

ఈ ప్ర‌చారాన్ని వారిద్ద‌రు కూడా ఖండించ‌లేదు. దీంతో స‌మంత కొత్త బోయ్ ప్రెండ్ కి వెల్క‌మ్ ప‌లికిన ట్లేన‌న్న ప్ర‌చారం పీక్స్ కు చేరింది. మ‌రి పాత జ్ఞాప‌కాల స్థానంలో కొత్త జ్ఞాప‌కాలు టాటూలుగా మార‌తాయా? రెండ‌వ ప్రేమ‌కు అంత గొప్ప స్థానం ఇస్తుందా? లేదా? అంటూ బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు మొద‌ల య్యాయి. బాలీవుడ్ వెబ్ సిరీస్ లో స‌మంత‌కు అవ‌కాశం ఇచ్చింది రాజ్ నిడిమోరు అన్న సంగ‌తి తెలి సిందే.

`ది ఫ్యామిలీ మ్యాన్` వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇచ్చి అక్క‌డ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసాడు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం మొద‌లైంది. బాలీవుడ్ లో ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ గా రాజ్ నిడుమోరుకు మంచి పేరుంది. ప్ర‌త్యేకించి వెబ్ సిరీస్ లు తెర‌కెక్కించ‌డంలో అత‌ని ప్ర‌త్యేక‌త వేరుగా ఉంది.

Tags:    

Similar News