హీరో గారి ఫుడ్‌ ట్రక్‌ వివాదం... అబ్బే అదేం లేదు!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌పై ఈ మధ్య కాలంలో వరుస విమర్శలు వస్తున్నాయి.;

Update: 2025-11-20 11:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌పై ఈ మధ్య కాలంలో వరుస విమర్శలు వస్తున్నాయి. సికిందర్ సినిమా ఫెయిల్యూర్‌కి సల్మాన్‌ ఖాన్ కారణం అంటూ స్వయంగా దర్శకుడు మురుగదాస్ వ్యాఖ్యలు చేయడం పెద్ద హాట్‌ టాపిక్ అయింది. ఆయన సమయ పాలన సరిగ్గా ఉండని కారణంగానే సికిందర్‌ సినిమా సరిగ్గా రాలేదు అంటూ తీవ్ర స్థాయిలో మురుగదాస్ వ్యాఖ్యలు చేయడంతో జాతీయ మీడియాలోనూ చర్చకు తెర తీసినట్లు అయింది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఒకప్పుడు ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేశాడు. కానీ గత పదేళ్ల కాలంగా ఆయన ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాడు. ఆయన చివరిగా ఏ సినిమాతో హిట్‌ కొట్టాడు అనేది కూడా అభిమానులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో ఆయనపై విమర్శలు రావడం, ఆయన్ను కొందరు టార్గెట్‌ చేయడం అనేది చాలా కామన్‌ విషయం అని మరికొందరు అంటున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ బిగ్‌బాస్‌ షో...

సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం బిగ్‌బాస్‌ కారణంగా కాస్త వార్తల్లో ఉంటున్నాడు. అది కూడా లేకుంటే ఆయనను జనాలు మరిచి పోతారేమో అంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ షూటింగ్‌కు రాత్రి ఎప్పుడో వస్తాడు, ఆ సమయంలోనూ ఆయన తాగి రావడం, తనతో పాటు ఫుడ్‌ కోర్ట్‌ను వెంట తెచ్చుకోవడం, ఎక్కువ సమయం తినడానికి సమయం కేటాయించడం వంటివి చేస్తాడు అంటూ కొందరు అంటూ ఉంటారు. అందులో నిజం లేదని ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ కాంపౌండ్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌ ఎక్కడ షూటింగ్‌లో పాల్గొన్నా ఆయన ఫుడ్‌ ట్రక్‌ బీయింగ్‌ హంగ్రీ సెట్స్ లో ఉంటుంది. అక్కడ మాత్రమే సల్మాన్‌ ఖాన్ తింటాడు. సాధారణంగా షూటింగ్‌కు వచ్చినప్పుడు ఫుడ్‌ ఖర్చు నిర్మాతలు భరించాల్సి ఉంటుంది. అంటే సల్మాన్‌ ఖాన్‌ బీయింగ్‌ హంగ్రీ ఖర్చు మొత్తం నిర్మాత పెట్టాల్సిందే కదా అనే చర్చ జరుగుతోంది.

సల్మాన్‌ బీయింగ్‌ హంగ్రీ ఫుడ్‌ ట్రక్‌..

బీయింగ్‌ హంగ్రీ ట్రక్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో పాటు, అందులో తయారు చేయబడే ప్రతి పదార్థం కు నిర్మాత చెల్లించాల్సి ఉంటుందని, అది నిర్మాతలకు ఆర్థిక భారంగా మిగులుతుందని కొందరు సల్మాన్‌ తీరుపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. గత కొన్నాళ్లుగా ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ ఫుడ్‌ ట్రక్‌ వివాదం విషయమై ప్రముఖ కొరియోగ్రాఫర్స్ పీయూష్‌ భగత్‌, షాజియా సమ్‌జీలు స్పందించాడు. వీరు సల్మాన్‌ ఖాన్‌తో వర్క్ చేసిన అనుభవం కలిగి ఉన్నారు. అందుకే వారు ఫుడ్‌ ట్రక్ విషయమై స్పందిస్తూ... సల్మాన్‌ ఖాన్‌ యొక్క బీయింగ్‌ హంగ్రీ ఫుడ్‌ ట్రక్‌ సెట్స్‌ కి వచ్చినా దాని నిర్వాహణ ఖర్చులు, ఇతర ఫుడ్‌ ఖర్చులు నిర్మాత చెల్లించరు. ఆ వాహనం యొక్క మొత్తం ఖర్చును సల్మాన్‌ ఖాన్‌ చూసుకుంటాడు. ఆయన తనతో పాటు, సెట్స్ లో ఉండే చాలా మందికి తన ఫుడ్‌ ట్రక్‌ లోనే ఫుడ్‌ ఏర్పాటు చేయిస్తారని వారు చెప్పుకొచ్చారు.

ఆమీర్‌ ఖాన్‌ డ్రైవర్‌ యొక్క సాలరీ..

సల్మాన్‌ ఖాన్‌ యొక్క ఫుడ్‌ ట్రక్‌ ఖర్చును నిర్మాతలు భరించాల్సి ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా గతంలో అమీర్‌ ఖాన్‌ డ్రైవర్‌ ఖర్చును సైతం నిర్మాత నుంచి వసూళ్లు చేస్తాడు అనే ప్రచారం ఉంది. కానీ అది కూడా నిజం కాదని ఈ కొరియోగ్రాఫర్లు చెప్పుకొచ్చారు. తన డ్రైవర్‌ యొక్క జీతాన్ని ఎందుకు నిర్మాత చెల్లిస్తాడు అంటూ అమీర్‌ ఖాన్‌ ఒక సారి తమతో అన్నాడని వారు చెప్పుకొచ్చారు. అయితే గతంలో నిర్మాత కరణ్‌ జోహార్‌ ఒక చిట్‌ చాట్‌లో హీరోలు ముఖ్యంగా స్టార్‌ హీరోలు తమ వ్యక్తిగత సిబ్బంది యొక్క ఖర్చులను నిర్మాతలపై వేస్తున్నారని, లేని పోని ఖర్చులను నిర్మాతతో పెట్టిస్తున్నారు అంటూ ఆరోపించారు. ఆ కారణంగానే చాలా మంది హీరోల గురించి ఇలాంటి ప్రచారం జరుగుతోంది. మరి కరణ్‌ జోహార్‌ చెప్పిన ఆ స్టార్‌ హీరోలు ఎవరో తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News