• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సంజూ చిన్న వ‌య‌సులోనే...

సంజూ చిన్న వ‌య‌సులోనే ప్ర‌పోజ్ చేసాడ‌ట‌

| బాలీవుడ్ తో పాటు సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ల్లోను న‌టిస్తున్నాడు సంజ‌య్ ద‌త్.

By - Tupaki Desk
Update: 2024-07-30 12:30 GMT

బాలీవుడ్ తో పాటు సౌత్ సినీప‌రిశ్ర‌మ‌ల్లోను న‌టిస్తున్నాడు సంజ‌య్ ద‌త్. ఇప్పుడు అత‌డు పాన్ ఇండియ‌న్ స్టార్ గా గుర్తింపు పొందాడు. అటు ఉత్త‌రాది ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు ద‌క్షిణాదినా అత‌డికి గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. కేజీఎఫ్ 2లో అధీరాగా అల‌రించిన‌ త‌ర్వాత ఇక్క‌డా వ‌రుస‌గా అవ‌కాశాలొస్తున్నాయి.

ఈ స‌మ‌యంలో అతడి బ‌ర్త్ డేకి ఇటు ద‌క్షిణాది అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం సంజయ్ దత్ 65వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా రోజంతా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వెట‌రన్ స్టార్ సైరా భాను ద‌త్ పై త‌నకు ఉన్న ప్రేమాభిమానాల‌ను చాటుకున్నారు. తన దివంగత భర్త దిలీప్ కుమార్ గురించి ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేస్తూ సంజూ తో, అత‌డి త‌ల్లి గారైన న‌ర్గీస్ ద‌త్ తో త‌న అనుబంధం గురించి ప్ర‌స్థావించారు. అంతేకాదు.. చిన్నతనంలో సంజయ్ దత్ తనకు ప్రపోజ్ చేసిన విషయాన్ని సైరా బాను గుర్తు చేసుకున్నారు.

ఇన్‌స్టాలో సైరా బాను దిలీప్ కుమార్- సంజయ్ దత్ ఉన్న పాత ఫోటోను పోస్ట్ చేసారు. ఈ ఫోటోతో పాటు హృద‌యాల‌ను హ‌త్తుకునే సందేశాన్ని రాసారు. సంజయ్ ఎప్పుడూ నా కుటుంబంలో వ్య‌క్తి. నా కుటుంబం మొత్తం, అమ్మాజీ నుండి అప్పాజీ వరకు.. సాహిబ్ వరకు.. నా వరకు.. మేము అతడి ఎదుగుద‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసాం. ఒక పసిబిడ్డ ఈ రోజు గొప్ప వ్యక్తిగా మారాడు.. అని తెలిపారు. యువ సంజయ్‌, అత‌డి దివంగత తల్లి నర్గీస్ దత్‌తో ఉన్న మధురమైన జ్ఞాపకాలను కూడా సైరా భాను గుర్తు చేసుకున్నారు.

నర్గీస్ మా ఇంటికి ఫంక్షన్లకి ఎప్పుడు వస్తుందో నాకు ఇంకా గుర్తుంది. ఈ ముద్దుగుమ్మ అందంగా ఉండే పిల్ల.. నర్గీస్ జీ కరచాలనం చేసి ఛలో, సైరా జీ కో బోలో తుమ్ క్యా! అని చెప్పేది. ఆపై సంజు నా వైపు చూసి, `మైన్ శైలా బాను సే షాదీ కరుంగా` అని ముద్దుగా చిన్న గొంతుతో చెప్పేవాడు. నేను , షర్మిలా ఠాగూర్ సంజూకి అత్యంత ఇష్టమైనవారమని నేను నమ్ముతున్నాను అని సైరా పేర్కొంది. మేమంతా అతని ప్రయాణంలో భాగం కావడాన్ని ఎంతో ఇష్టపడతాము. నా హృదయంలో అతడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంద‌ర్భంగా ద‌త్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... KD -ది డెవిల్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. సంజయ్ దత్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. అతడిని `ధక్ దేవ`గా పరిచయం చేశారు. ది లార్డ్ ఆఫ్ డెవిల్స్ డెమోక్రసీ, ధాక్ దేవా, #KD పాతకాలపు యుద్దభూమిలోకి అడుగు పెట్టాడు.. తీవ్రతతో కూడిన తుఫానును తీసుకువస్తున్నాడు అని అతడి పోస్ట‌ర్ కి క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రం తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీలో విడుదల కానుంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 1970ల నేప‌థ్యంలో బెంగుళూరులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఇది రూపొందుతోంది.

ఇదే కాకుండా సంజయ్ దత్ త‌దుప‌రి రవీనా టాండన్‌తో `గూఢ‌చారి`లోను న‌టిస్తున్నాడు. OTT ప్లాట్‌ఫారమ్ జియో సినిమాలో ఆగస్టు 9న విడుదల కానుంది. ఇటీవలే రణవీర్ సింగ్ డాన్ 3లో సంజయ్ దత్ న‌టిస్తున్నార‌ని ధృవీక‌రించారు. మోస్ట్ అవైటెడ్ హౌస్‌ఫుల్ 5 తారాగణంలోను అత‌డు చేరాడు.

Tags:    
  • Sairabanu 
  • Bollywood 
  • Filmindustry 
  • Sanjaydutt 
  • Childhood 
  • Kgf2 
  • Doubleismart 
  • Movies 
  • Birthdaysanjaydutt 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS