MS సుబ్బలక్ష్మి బయోపిక్ మేకర్స్ ఎవరు?
పాపులర్ కర్ణాటిక్ గాయని ఎం.ఎస్. సుబ్బలక్ష్మీ జీవిత కథని త్వరలో తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే.;
పాపులర్ కర్ణాటిక్ గాయని ఎం.ఎస్. సుబ్బలక్ష్మీ జీవిత కథని త్వరలో తెరపైకి తీసుకురానున్న విషయం తెలిసిందే. నైటింగేల్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్‌గా పేరు తెచ్చుకున్న సుబ్బలక్ష్మి శ్రీవెంకటేశ్వర సుప్రభాతంతో మరింత పాపులర్ అయ్యారు. గాయనిగా భారతరత్న అందుకున్న తొలి గాయనిగా సుబ్బలక్ష్మీ రికార్డు సొంతం చేసుకున్నారు. అంటా ప్రఖ్యాత సింగర్ జీవిత కథ ఆధారంగా భారీ స్థాయిలో ఓ పాన్ ఇండియా మూవీ తెరపైకి రాబోతోంది. దీనికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తారని వార్తలు వినిపించాయి. ఇక ఎం.ఎస్. సుబ్బలక్ష్మీ పాత్రలో కీర్తి సురేష్ లేదా ,త్రిష నటించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో సాయి పల్లవి టైటిల్ రోల్ పోషించబోతోందని తెలిసింది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌ని గీతా ఆర్ట్స్ కాకుండా రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించబోతున్నారని, అతనితో కలిసి బీవీ వర్క్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తారని ఇన్ సైడ్ టాక్.
లెజెండరీ సింగర్‌గా సాయి పల్లవి నటించనున్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించే అవకాశం ఉందని, వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఇతిహాస గాథ `రామాయన`లో సీతగా నటిస్తోంది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది.
ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్న సాయి పల్లవి ఈ ప్రతిష్టాత్మక చిత్రం తరువాతే ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం డేట్స్ కేటాయించనుందట. ఇందులోని ఇతర పాత్రల్లో ఎవరు నటస్తారు. టెక్నీషియన్స్ ఎవరు అన్నది తెలియాలంటే ఈ ప్రాజెక్ట్‌కు సంబధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.