ప్రభాస్ సినిమా ఆడిషన్ కాల్.. ప్రాంక్ అనుకున్న హీరోయిన్..!

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఆడిషన్ కాల్ ని ఒక హీరోయిన్ అదేదో ప్రాంక్ కాల్ అనుకుందట.;

Update: 2025-11-26 08:04 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఆడిషన్ కాల్ ని ఒక హీరోయిన్ అదేదో ప్రాంక్ కాల్ అనుకుందట. ఐతే ఆ తర్వాత తన మేనేజర్ ని వెరిఫై చేయమని చెప్పగా నిజంగానే ప్రభాస్ సినిమా కోసం కాల్ అని తెలిసి సర్ ప్రైజ్ అయ్యిందట. ఇంతకీ ప్రభాస్ ఏ సినిమా హీరోయిన్ ఇలా చెప్పిందో తెలుసా.. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్న రాజా సాబ్ సినిమా కోసమే అన్నమాట. ప్రభాస్ మారుతి కాంబోలో పీపుల్ మీడియా నిర్మిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటించారు. సినిమాలో మరో హీరోయిన్ గా రిద్ధి కుమార్ కూడా నటిస్తుంది.



 


ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలో కూడా..

లవర్ సినిమాతో రాజ్ తరుణ్ తో జత కట్టిన రిద్ధి కుమార్ ఆ తర్వాత కన్నడ, తమిళ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలో కూడా రిద్ధి కుమార్ నటించింది. ఐతే రాజా సాబ్ సినిమాలో నటించేందుకు గాను నిర్మాత ఎస్.కె.ఎన్ కాల్ చేశారు. ప్రభాస్ తో సినిమా చేస్తున్నాం.. మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకుందామని అనుకుంటున్నామని అనగా అదేదో ప్రాంక్ కాల్ అని లైట్ తీసుకుందట రిద్ధి. ఐతే ఆ తర్వాత తన మేనేజర్ తో చెక్ చేయమని చెప్పగా నిజంగానే యువి క్రియేషన్స్ ద్వారా ఎస్.కె.ఎన్ ఈ కాల్ చేశారని తెలిసింది.

వెంటనే ఓకే చెప్పి లుక్ టెస్ట్ చేసి ఆడిషన్ ఇచ్చానని చెప్పింది రిద్ధి కుమార్. ఫైనల్ గా నిధి, మాళవిక తో పాటు రిద్ధి కూడా రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ తో జత కడుతుంది. రాధే శ్యాం లో నటించినా పెద్దగా ఇంపార్టెంట్ రోల్ కాకపోవడంతో ఎవరు గుర్తించలేదు. ఐతే ఈసారి రిద్ధి రాజా సాబ్ తో తనకు మంచి గుర్తింపు వస్తుందని చెబుతుంది.

సినిమాపై అంచనాలు పెంచిన రాజా సాబ్ ట్రైలర్..

ప్రభాస్ లాంటి స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే కెరీర్ కి మంచి బూస్టింగ్ ఇస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న రాజా సాబ్ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే రిలీజై సినిమాపై అంచనాలు పెంచింది. థ్రిల్లర్ జోనర్ లో ఆడియన్స్ ని భయపెడుతూ ఎంటర్టైన్ చేసేందుకు మారుతి రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో పాటు నెక్స్ట్ ఇయర్ ఫౌజీ సినిమాను కూడా రిలీజ్ చేసే ప్లానింగ్ చేస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వి ప్రభాస్ తో జత కడుతుంది.

Tags:    

Similar News