ఎన్టీఆర్‌ - రష్మిక.. ఫ్యాన్స్ కి బిగ్ సర్‌ప్రైజ్‌

ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-05-23 11:30 GMT

ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర సినిమాలో జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు హిందీలో నటిస్తున్న వార్‌ సినిమాలో ఎన్టీఆర్‌ కు జోడీగా ఒక బాలీవుడ్‌ హీరోయిన్ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ చేయబోతున్న తదుపరి సినిమా గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. దేవర సినిమా షూటింగ్ ముగియడమే ఆలస్యం వెంటనే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమాకు ఎన్టీఆర్‌ జాయిన్ అవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబో మూవీని ఈ ఏడాదిలోనే మొదలు పెట్టబోతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు అధికారికంగా ప్రకటించారు. ఒక వైపు సలార్‌ 2 పనిలో ఉన్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ మరో వైపు ఎన్టీఆర్ తో 'డ్రాగన్‌' అనే భారీ యాక్షన్‌ సినిమాకు సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నాడు.

ఎన్టీఆర్‌ కి జోడీగా ఈ సినిమాలో నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. యానిమల్‌ సినిమా తర్వాత పాన్‌ ఇండియా రేంజ్ లో ముద్దుగుమ్మ రష్మిక మందన్న కి మంచి క్రేజ్ దక్కింది. అందుకే డ్రాగన్ లో ఆమెను తీసుకోవాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నాడట.

Read more!

పుష్ప 2 సినిమాలో నటిస్తున్న రష్మిక మందన్న మరో వైపు వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు అయిన రెయిన్‌ బో మరియు గాళ్ ఫ్రెండ్‌ సినిమాలను చేస్తుంది. ఇవే కాకుండా విజయ్ దేవరకొండ తో కలిసి ఒక సినిమాలో రష్మిక మందన్న నటించేందుకు ఓకే చెప్పిందని తెలుస్తోంది.

ఎన్టీఆర్ మరియు రష్మిక మందన్న ల అభిమానులు చాలా కాలంగా ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు సినిమా కు సంబంధించిన వార్తలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా రష్మిక మందన్న కచ్చితంగా ఎన్టీఆర్‌ కి సరి జోడీ అంటూ అప్పుడే ఫ్యాన్స్ లో చర్చ మొదలు అయ్యింది.

Tags:    

Similar News