రష్మిక చేతుల్లో కాంతారా భవిష్యత్తు..?

నేడు అంటే అక్టోబర్ 21న రష్మిక నటించిన థామ రిలీజ్ అవుతుంది. థ్రిల్లర్ కామెడీగా రాబోతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా నటించాడు.;

Update: 2025-10-21 04:19 GMT

కన్నడ భామ రష్మిక మందన్నకి అసలు కాంతారాకి సంబంధం లేదు కదా మరి అలాంటిది కాంతారా ఫ్యూచర్ ఎందుకు రష్మిక చేతుల్లో ఉంటుంది అంటే.. కాస్త డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే. అసలే కాంతారా టీం ని విష్ చేయలేదని కన్నడిగులు రష్మిక మీద ఫైర్ మీద ఉంటే మళ్లీ ఆ సినిమా ఫ్యూచర్ రష్మిక చేతుల్లో ఉందంటే మాత్రం ఇంకా రగిలిపోతారు. ఐతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బాలీవుడ్ లో కాంతారా 2022లో వచ్చి సంచలనం సృష్టించింది. సౌత్ అన్ని భాషలతో ఈక్వెల్ గా కాంతారా అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది.

కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి మ్యాజిక్..

ఇక రీసెంట్ గా రిలీజైన కాంతారా చాప్టర్ 1 సినిమా కూడా బాలీవుడ్ లో మంచి టాక్ తో రన్ అవుతుంది. రెండు వారాల్లో దాదాపు హిందీ బాక్సాఫీస్ దగ్గరే 180 కోట్ల దాకా రాబట్టింది కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి మరోసారి మ్యాజిక్ చేసి చూపించారు. డైరెక్షన్, యాక్టింగ్ రెండిటిలో తనకు తానే పోటీ పడి అదరగొట్టారు. ఐతే 3వ వారంలోకి వచ్చిన కాంతారా 1కి రష్మిక సినిమా అడ్డు పడుతుంది.

నేడు అంటే అక్టోబర్ 21న రష్మిక నటించిన థామ రిలీజ్ అవుతుంది. థ్రిల్లర్ కామెడీగా రాబోతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా కూడా నటించాడు. ట్రైలర్ తో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన థామ సినిమాతో రష్మిక మరో సక్సెస్ అందుకోవాలని చూస్తుంది. ఐతే దీపావళి సందర్భంగా థామ రిలీజైంది. ట్యూస్ డే అయినా కూడా సినిమా పండగకి రిలీజ్ చేయాలని అలా ఫిక్స్ చేశారు.

రష్మిక సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం..

ఐతే దీపావళి నాడు కూడా కాంతారా 1కి హిందీలో మంచి వసూళ్లే వచ్చాయి. ఇక 200 కోట్ల మార్క్ టచ్ చేయాలంటే రష్మిక సినిమాకు పోటీగా ఆడాలి. ఒకవేళ రష్మిక సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం కాంతారా 1కి కష్టం అవుతుంది. సో కాంతారా 1 ఈరోజు నుంచి వసూళ్లు ఎలా ఉంటాయన్నది రష్మిక సినిమా మీదే ఆధారపడి ఉంటుంది. బాలీవుడ్ లో సౌత్ యాక్టర్స్, సౌత్ డైరెక్టర్స్ చేసే సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.

రష్మిక ఇటు సౌత్ సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో అదరగొట్టేస్తుంది. తెలుగులో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత అమ్మడు విజయ్ దేవరకొండతో జత కడుతుంది. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

Tags:    

Similar News