బిగ్ బాస్ లోకి నేషనల్ క్రష్.. అందరి చూపు దానిపైనే!
బిగ్‌బాస్.. బుల్లితెర రియాలిటీ షో. పేరుకే బుల్లితెర షో కానీ దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;
బిగ్‌బాస్.. బుల్లితెర రియాలిటీ షో. పేరుకే బుల్లితెర షో కానీ దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే బిగ్ బాస్ పలు భాషల్లో ఎన్నో సీజన్లు పూర్తి చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ గా కొనసాగుతుంది. బిగ్ బాస్ వస్తుందంటే ఆడియన్స్ దృష్టంతా ఆ షో పైనే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ సీజన్ బాలేదని అంటూనే విపరీతమైన వ్యూయర్‌షిప్ ను అందుకునే షో ఏదైనా ఉందా అంటే బిగ్ బాస్ అనే చెప్పాలి.
అంతటి క్రేజ్ ఉంది కాబట్టే, సినీ సెలబ్రిటీలు సైతం బిగ్‌బాస్ కు వెళ్లి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు హిందీ బిగ్ బాస్ కు ఓ మూవీ టీమ్ వెళ్లింది. ఎప్పటిలానే ఈ సారి కూడా తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రిటీలు బిగ్ బాస్ కు వెళ్లినప్పటికీ ఈ సారి వచ్చిన గెస్ట్ మాత్రం కాస్త స్పెషల్. ఆ సెలబ్రిటీ మరెవరో కాదు, నేషనల్ క్రష్ రష్మిక.
రష్మిక, సల్మాన్‌ల రీయూనియన్
హిందీ బిగ్ బాస్ కు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షో కు రష్మిక రావడం మరింత స్పెషల్ గా మారింది. దానికి కారణం వీరిద్దరూ కలిసి రీసెంట్ గా సికందర్ మూవీలో నటించారు. ఆ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే సికందర్ తర్వాత రష్మిక, సల్మాన్ మరోసారి ఈ షో ద్వారా కలవడం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. థామా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక బిగ్ బాస్ షో కు వెళ్లారు.
మరింత స్పెషల్ గా మారనున్న వీకెండ్ ఎపిసోడ్
మామూలుగా అయితే హిందీ బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ ను శుక్రవారం షూట్ చేస్తారు. కానీ ఈసారి సల్మాన్ రియాద్ కు వెళ్లాల్సి ఉండటంతో దాన్ని గురువారానికి మార్చగా, వీకెండ్ ఎపిసోడ్ లో థామా టీమ్ తో పాటూ సింగర్స్ షాన్, జాస్మిన్ సాండ్లాస్ కూడా పాల్గొన్నారు. చూస్తుంటే ఈ వీకెండ్ ఎపిసోడ్ స్టార్ స్టడెడ్ ఎపిసోడ్ గా మారేట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇంట్లో జరిగే డ్రామా, సల్మాన్ హోస్టింగ్, థామా టీమ్ సందడి, రష్మిక- సల్మాన్ రీయూనియన్.. ఇవన్నీ కలిపి ఈ ఎపిసోడ్ ను ఈ సీజన్ లోనే బెస్ట్ గా నిలిపేట్టున్నాయి. ఈ స్పెషల్ ఎపిసోడ్ ను చూడ్డానికి ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.