అమ్మాయిల తరపున వకాల్తా పుచ్చుకున్న రష్మిక..!
తాజాగా రష్మిక మందన్న ఒక చిట్ చాట్‌లో ప్రేమ విఫలం, ఆ సమయంలో ఇద్దరూ పడే బాధ గురించి మాట్లాడింది.;
నేషనల్ క్రష్ రష్మిక మందన్న 'థామా' సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయుష్మాన్ ఖురాన హీరోగా నటించిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీపై అంచనాలు పెరిగే విధంగా రష్మిక మందన్న గత రెండు వారాలుగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే. ఇదే సమయంలో రష్మిక తన రాబోయే సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కానీ థామా సినిమా ప్రమోషన్ సమయంలో అయినా రష్మిక తన వివాహ నిశ్చితార్థం గురించి ఓపెన్ అవుతుందని అంతా భావించారు. కానీ రష్మిక ఆ ప్రశ్నలు రాకుండానే చాలా జాగ్రత్త పడింది. మీడియా సమావేశంలో ఆ విషయాల గురించి ప్రస్తావించిన సమయంలో మౌనంగా నవ్వుతూ ఉండి పోయింది. దాంతో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల యొక్క వివాహ నిశ్చితార్థం గురించి ఇంకా క్లారిటీ రాలేదు అని అభిమానులతో పాటు అంతా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్న విషయం తెల్సిందే.
రష్మిక మందన్న థామా సినిమా రిలీజ్
తాజాగా రష్మిక మందన్న ఒక చిట్ చాట్‌లో ప్రేమ విఫలం, ఆ సమయంలో ఇద్దరూ పడే బాధ గురించి మాట్లాడింది. చాలా మంది లవ్ బ్రేకప్ సమయంలో ఎక్కువగా అబ్బాయిలు బాధ పడుతారు, వారే చాలా కాలం పాటు అందులో నుంచి బయటకు రాలేక పోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, దారుణాలకు వడిగడుతారు అంటూ ప్రచారం ఉంది. పలు సర్వేల్లోనూ అదే విషయం వెల్లడి అయింది. కానీ రష్మిక మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పుకొచ్చింది. ప్రేమ విఫలం అయిన సమయంలో అబ్బాయిలు మాత్రమే బాధ పడుతారు అంటూ ఉన్న ప్రచారంను ఆమె కొట్టి పారేసింది. అబ్బాయిలు ఎక్కువగా బాధ పడుతారు అంటే తాను ఒప్పుకోను అంది. అబ్బాయిలకు ఏమాత్రం తగ్గకుండా, వారి రిలేషన్‌షిప్ విషయంలో అమ్మాయిలు కూడా చాలా సీరియస్‌గా ఉంటారని రష్మిక మందన్న తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
లవ్ ఫెయిల్యూర్‌పై రష్మిక మందన్న
ఇంకా రష్మిక మందన్న మాట్లాడుతూ... అమ్మాయిలు బాధను వ్యక్తపరిచేందుకు మార్గాలు లేవు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అబ్బాయిలు ప్రేమ విఫలం అయిందంటే గడ్డాలు పెంచుకోవడం, మందు తాగడం చేస్తారు. కానీ అమ్మాయిలు అలా చేయలేరు. పెంచుకోవడానికి గడ్డం ఉండదు, అలాగే మందు తాగి తమ ప్రేమ విఫలం గురించి బయట పడరు అంది. అమ్మాయిలకు తమ ఆవేదన వ్యక్తం చేసుకునేందుకు ఎక్కువ మార్గాలు లేకపోవడం వల్లే అబ్బాయిలకు ఈ విషయంలో ఎక్కువగా సానుభూతి లభిస్తుంది అంటూ రష్మిక మందన్న ఈ విషయంలో అమ్మాయిల తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆమెకు మద్దతుగా అమ్మాయిలు స్పందిస్తూ ఉంటే, కొందరు అబ్బాయిలు మాత్రం రష్మిక అభిప్రాయం ను వ్యతిరేకిస్తున్నారు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విడుదల తేదీ...
నేడు థామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక ఇదే ఏడాది ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నవంబర్ 7న విడుదల కాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో విభిన్నమైన కథాంశంను చూపించబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అంతే కాకుండా ఆకట్టుకునే రష్మిక లుక్ సైతం సినిమా పై ఆసక్తిని పెంచింది. అందుకే ది గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు విడుదల అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాదిలోనే ఈ సినిమా గురించి ప్రచారం జరిగింది. కానీ ఆ సమయంలో విడుదల కాలేదు. ఇప్పుడు విడుదలకు ముస్తాబు అవుతుంది. మరో వైపు రష్మిక చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత విజయ్ దేవరకొండతో వివాహం ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.