ర‌ష్మిక జీవితంలో కొత్త మ‌లుపు

ర‌ష్మిక జీవితంలో ఊహించ‌ని మ‌లుపును చూడ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే ఈ భామ ఎంట‌ర్ ప్రెన్యూర్ కాబోతోంది.;

Update: 2025-07-20 05:15 GMT

ర‌ష్మిక జీవితంలో ఊహించ‌ని మ‌లుపును చూడ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే ఈ భామ ఎంట‌ర్ ప్రెన్యూర్ కాబోతోంది. బాలీవుడ్ టాలీవుడ్ లో ఇప్ప‌టికే చాలా మంది క‌థానాయిక‌లు ఎంట‌ర్ ప్రెన్యూర్లుగా ఎదుగుతున్నారు. ఇప్పుడు వారి బాట‌లోనే ర‌ష్మిక కూడా అనూహ్య‌మైన స్టెప్ తీసుకుంటోంది. ర‌ష్మిక త్వ‌ర‌లోనే వ్యాపార రంగంలో అడుగుపెట్ట‌బోతోంది.

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకునేందుకు ఈ కూర్గ్ (క‌న్న‌డ‌) బ్యూటీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింద‌ని తెలుస్తోంది. అయితే ర‌ష్మిక ప్రారంభించ‌బోయే వ్యాపారం ఏమై ఉంటుంది? అంటే దానికి ఇంకా ఎలాంటి స‌మాధానం లేదు. చాలా మంది అగ్ర క‌థానాయ‌కలు వ‌స్త్ర వ్యాపారంలో ఉన్నారు. ర‌క‌ర‌కాల ఫ్యాష‌న్ లేబుల్స్ ప్రారంభించి భారీగా లాభాలార్జిస్తున్నారు. దీపిక ప‌దుకొనే, సోన‌మ్ క‌పూర్, ఆలియా భ‌ట్ వంటి ప్ర‌ముఖులు ఫ్యాష‌న్ రంగంలో రాణిస్తున్నారు. ఇప్పుడు ర‌ష్మిక కూడా అదే బాట‌ను అనుస‌రిస్తోందా? లేక ఏదైనా ఇత‌ర రంగాల్లో అడుగుపెడుతుందా? అన్న‌ది వేచి చూడాలి.

ర‌ష్మిక త‌న జీవితంలో కొత్త మ‌లుపు గురించి ప్ర‌స్థావిస్తూ....తాను త్వరలో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించింది. ఈ రోజు నేను చాలా చాలా ముఖ్యమైన దాని కోసం షూటింగ్ చేయబోతున్నాను.. నువ్వు చెప్పినట్టే నేను ప్రారంభించబోయే వ్యాపారానికి సంబంధించిన షూట్ చేసాను! అని త‌న మామ్ కి ర‌ష్మిక వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల్లి గురించి ప్ర‌స్థావించిన ర‌ష్మిక‌.. అమ్మ ఎప్పుడూ ముందుగా తెలుసుకుంటుంది.. అని చెప్పింది. తన మ‌న‌సులో ఆలోచ‌న‌ల‌ను త‌న మాతృమూర్తి ముందే తెలుసుకున్న విష‌యాన్ని పేర్కొంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ర‌ష్మిక త‌దుప‌రి `పుష్ప 3`లో న‌టించాల్సి ఉంటుంది. అంత‌కంటే ముందే రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో `ది గర్ల్ ఫ్రెండ్` అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కనిపించనుంది. అటు బాలీవుడ్ లోను ప‌లు చిత్రాల్లో న‌టిస్తోంది.

Tags:    

Similar News