రష్మిక దీపావళి టపాసు పేలుతుందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ఏడాది ఆరంభంలో ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.;
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ ఏడాది ఆరంభంలో ఛావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఊహించని రేంజ్‌లో ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా రష్మిక మందన్న రేంజ్‌ను మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమాకు ముందు హిందీలో యానిమల్ సినిమాతోనూ రష్మిక హిట్ కొట్టింది. అయితే ఇటీవల ఈమె సల్మాన్ ఖాన్‌తో వచ్చిన సికిందర్ సినిమా కమర్షియల్‌గా డిజాస్టర్ అయింది. అయితే సినిమా ఫ్లాప్ కి రష్మిక కారణం కాదనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే హీరో సల్మాన్ ఖాన్, దర్శకుడు మురుగదాస్ సికిందర్ ఫ్లాప్ గురించి నువ్వు అంటే నువ్వు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. సికిందర్ ఫలితం గురించి పెద్దగా రష్మికకి ఇబ్బంది లేదని చెప్పాలి. ఛావా సినిమా తర్వాత బాలీవుడ్‌లో రష్మిక మరో విజయం కోసం ఎదురు చూస్తోంది.
రష్మిక హీరోయిన్‌గా థామా సినిమా...
రష్మిక కోరుకుంటున్న ఆ విషయం థామా సినిమాతో దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఈ మధ్య కాలం హ్రరర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెల్సిందే. స్క్రీ 2తో పాటు పలు హర్రర్ సినిమాలకు మంచి స్పందన దక్కడం చూశాం. అందుకే రష్మిక మందన్న తాజా హర్రర్ మూవీ థామా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా థామా సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్ చాలా విభిన్నంగా ఉండటం వల్ల ప్రేక్షకులు నచ్చుతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం రష్మిక మందన్న కాస్త ఎక్కువగానే కష్టపడిందని, అంతే కాకుండా ప్రమోషన్ కోసం రష్మిక కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతోందట.
విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న నిశ్చితార్థం
ఈ సినిమా రష్మిక మందన్నకు అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవలే రష్మిక మందన్న వివాహ నిశ్చితార్థం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ఆమె వివాహం కన్ఫర్మ్ అయిందని, పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిశ్చితార్థం విషయం ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అనధికారికంగా కన్ఫర్మ్ చేశారు. దాంతో రష్మిక నిశ్చితార్థం తర్వాత మొదటి సారి థామా సినిమాతో రాబోతుంది. అందుకే ఈ సినిమా ఆమెకి అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. థామా సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం అనే నమ్మకంను రష్మిక మందన్న ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. థామా సినిమాలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. అయినా కూడా రష్మిక మందన్న పేరును ముందు ఉంచి సినిమాను మేకర్స్ ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం.
ఛావా సినిమా మాదిరిగా థామా హిట్ అయ్యేనా?
ఈ ఏడాదిలో ఛావా సినిమాతో పాటు కుబేరా సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్న రష్మిక మందన్న త్వరలోనే మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫలితం ఆధారంగా ఆ సినిమా ఫలితాలు, ఓపెనింగ్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమా ఫలితం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక దీపావళికి పేల్చబోతున్న ఈ టపాసు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ థామా టపాసు మిరపకాయ్ టపాసు మాదిరిగా చిన్నగా పేలుతుందా లేదంటే లక్ష్మీ బాంబ్ మాదిరిగా భారీ శబ్దంతో పేలుతుందో చూడాలి. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే రష్మిక బాలీవుడ్‌లో మరింత బిజీ కావడం ఖాయం అనే అభిప్రాయంను సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.