రష్మిక తెలివి... చేయనని చెప్పకుండా భలే చెప్పింది!

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న.;

Update: 2025-11-10 08:55 GMT

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ ఏడాది అత్యధిక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ మూవీ ఛావా తో ఈ ఏడాది ఆరంభించిన రష్మిక మందన్న ఆ తర్వాత సికిందర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛావా సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆల్ టైమ్ రికార్డ్‌లను నమోదు చేసిన విషయం తెల్సిందే. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక మందన్న క్రేజ్ మరింతగా సికిందర్‌తో పెరుగుతుందని అంతా భావించారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచింది. అయినా కూడా రష్మిక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే ఆమె బాలీవుడ్‌ సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మాత్రం నిర్ణయం తీసుకుంది అని ఆమె సన్నిహితులు అంటున్నారు.

ధనుష్‌ కి జోడీగా కుబేర సినిమాలో రష్మిక మందన్న

సికిందర్ తర్వాత సౌత్‌లో ఈమె నటించిన కుబేర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ హీరోగా నాగార్జున ముఖ్య పాత్రలో నటించిన కుబేర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సౌత్‌ లో ఈ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితం అయింది. రష్మిక హిందీ హర్రర్‌ మూవీ థామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సారి తన సత్తా చాటింది. సినిమాకు నెగటివ్‌ రివ్యూలు వచ్చినా కూడా వసూళ్ల విషయంలో చాలా సంతృప్తిని రష్మిక మందన్న వ్యక్తం చేసే విధంగా ఫలితం వచ్చింది. ఇటీవల ది గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలు మీడియా సమావేశాలకు, టాక్‌ షో లకు, ఇంటర్వ్యూలకు హాజరు అయిన రష్మిక మందన్న పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. ఆ సమయంలోనే తన ఐటెం సాంగ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా టాక్‌ షో..

జీ5 లో స్ట్రీమింగ్‌ అవుతున్న జగపతిబాబు యొక్క జయమ్ము నిశ్చయమ్మురా టాక్‌ షో లో రష్మిక మందన్న పాల్గొంది. ఆ సమయంలో ఐటెం సాంగ్‌ గురించి మీ అభిప్రాయం ఏంటి అన్నట్లుగా ప్రశ్నించిన సమయంలో ఆసక్తికర సమాధానం ఆమె నుంచి వచ్చింది. కచ్చితంగా ఐటెం సాంగ్‌ అనేది చేయాలని ఉంది, అయితే ఐటెం సాంగ్‌ నేను చేయాలి అంటే కేవలం ఆ నలుగురు దర్శకుల సినిమాల్లో మాత్రమే చేస్తాను అన్నట్లుగా మెలిక పెట్టింది. నలుగురు దర్శకుల సినిమాల్లో ఐటెం సాంగ్‌ చేస్తాను అనడం ద్వారా రష్మిక ఇన్‌డైరెక్ట్‌గా తాను ఐటెం సాంగ్స్ విషయంలో అస్సలు ఆసక్తిగా లేను అని చెప్పకనే చెప్పింది. చాలా మంది హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ వెంట పడుతూ ఉంటే రష్మిక మాత్రం భలేగా ఐటెం సాంగ్స్ చేయను అని చెప్పకుండానే భలే తెలివిగా చెప్పింది అంటూ నెటిజన్స్‌, ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి...

రష్మిక మందన్న త్వరలోనే విజయ్ దేవరకొండ ఇంట అడుగు పెట్టబోతుందనే విషయం తెల్సిందే. ఇప్పటి వరకు అధికారికంగా వీరి వివాహం, ప్రేమ విషయాల గురించి రివీల్‌ కాలేదు. కానీ మీడియాలో మాత్రం ఈ వార్తలు పతాక స్థాయిలో వస్తున్నాయి. రష్మిక కూడా చెప్పి చెప్పనట్లుగా చెప్పేసింది. దాంతో మరింతగా క్లారిటీ వచ్చినట్లు అయింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరి పెళ్లి ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి. నిశ్చితార్థం చాలా సింపుల్‌గా సన్నిహితుల సమక్షంలో జరిగింది. పెళ్లి గురించి ఎందుకు వీరు బయట పెట్టడం లేదు అర్థం కావడం లేదు అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. హీరో హీరోయిన్‌ పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో చాలా కామన్ విషయం. అయితే వీరి జోడి ఎంత వరకు హిట్ గా నిలుస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా టాప్‌ రేంజ్‌ లో ఉన్న సమయంలో రష్మిక పెళ్లి పీటలు ఎక్కితే ఆమె కెరీర్ ఏం అవుతుందా అనేది చూడాలి.

Tags:    

Similar News