హను దర్శకత్వంలో నేషనల్ క్రష్
పలు పాన్ ఇండియన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న రష్మిక మందన్నా ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సిద్ధమవుతున్నారు.;
కిర్రిక్ పార్టీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం రష్మిక మందన్నా టాలీవుడ్ లోకి ఛలో సినిమాతో అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే యూత్ ను ఆకట్టుకున్న రష్మిక ఆ తర్వాత తక్కువ కాలంలోనే అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్నారు. వరుస సక్సెస్‌లు రష్మికకు తిరుగులేని స్టార్‌డమ్ ను తెచ్చిపెట్టాయి.
డెబ్యూ డైరెక్టర్ తో రష్మిక సాహసం
పలు పాన్ ఇండియన్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న రష్మిక మందన్నా ఇప్పుడు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సిద్ధమవుతున్నారు. రవీంద్ర పుల్ల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఆల్రెడీ టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ తోనే మైసా మూవీ ఆడియన్స్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేయగలిగింది.
నెవర్ బిఫోర్ రోల్ లో రష్మిక
ఈ సినిమాలో రష్మిక ఓ గోండు మహిళ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు చేసిన రష్మిక తన కెరీర్ లో మునుపెన్నడూ చేయని పాత్రను మైసాలో చేయబోతున్నారు. తన పాత్రకు న్యాయం చేయడానికి రష్మిక ఈ సినిమా కోసం ఫిజికల్ ట్రాన్సర్మేషన్ తో పాటూ యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
ఘనంగా జరిగిన మైసా పూజా కార్యక్రమాలు
ఇదిలా ఉంటే తాజాగా మైసా సినిమా ఆదివారం నాడు పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా మొదలైంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం హాజరయ్యారు. ప్రారంభ సన్నివేశానికి నిర్మాత సురేష్ బాబు క్లాప్ కొట్టగా, డైరెక్టర్ రవికిరణ్ కోలా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఆ తర్వాత బౌండ్ స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కు అందించిన హను రాఘవపూడి, మొదటి షాట్ కు దర్శకత్వం కూడా వహించారు.
ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న మైసా సినమిఆ రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుండగా, రష్మిక మొదటి షెడ్యూల్ నుంచి షూటింగ్ లో జాయిన్ కానున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ లో శ్రేయాస్ పి కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న మైసా సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుండగా, త్వరలోనే మేకర్స్ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను వెల్లడించనున్నారు.