భారీగా రేటు పెంచిన రష్మిక.. అయినా నిర్మాతలు ఆమెకే ఓటు
తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి, తన క్రేజ్ ను సినిమా సినిమాకీ విపరీతంగా పెంచుకుంటున్న రష్మిక కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.;
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక ఇప్పుడు పలు భాషల్లో సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి, తన క్రేజ్ ను సినిమా సినిమాకీ విపరీతంగా పెంచుకుంటున్న రష్మిక కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది.
వరుస హిట్లతో లక్కీ హీరోయిన్ గా మారిన రష్మిక
పుష్ప సినిమాతో భారీ విజయాన్ని అందుకుని నేషనల్ వైడ్ తన పేరును మార్మోగేలా చేసిన రష్మిక కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. రష్మిక నటించిన పుష్ప, యానిమల్, పుష్ప2, ఛావా సినిమాలు మంచి హిట్లుగా నిలవడమే కాకుండా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో రష్మిక లక్కీ హీరోయిన్ గా మారిపోయారు.
భారీగా డిమాండ్ చేస్తున్న రష్మిక
రీసెంట్ గా గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రష్మిక ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 2025లో పలు సక్సెస్‌ఫుల్ సినిమాలతో ఆడియన్స్ ను పలకరించిన రష్మిక వచ్చే ఏడాది చేయనున్న ప్రాజెక్టుల కోసం తన రెమ్యూనరేషన్ ను పెంచినట్టు తెలుస్తోంది. 2026లో చేయనున్న సినిమాల కోసం రష్మిక చాలా భారీగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ లోనే..
వరుస హిట్ల తర్వాత రష్మిక తన రెమ్యూనరేషన్ ను ఏకంగా రూ.10 కోట్లకు పెంచారని, నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. రష్మిక తమ సినిమాలో నటిస్తే సినిమాకు నేషనల్ వైడ్ గా క్రేజ్ తో పాటూ మంచి బిజినెస్ కూడా జరుగుతుందని మేకర్స్ ఆమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. 2026 ఫిబ్రవరిలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోనున్న రష్మిక, పెళ్లి తర్వాత కూడా తన యాక్టింగ్ కెరీర్ ను కంటిన్యూ చేయనున్నారు.