ఇండియన్ బాక్సాఫీస్ గోల్డెన్ లెగ్..

ఇదిలా ఉండగా.. ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. కిరిక్ పార్టీ అనే సినిమాతో తన నటన జీవితాన్ని ఆరంభించింది.;

Update: 2025-11-03 08:30 GMT

రష్మిక మందన్న.. ప్రస్తుతం ఈమె దూకుడు చూస్తుంటే ఎంతటి వారికైనా ఆశ్చర్యం వేయక మానదు. వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ.. ఆ సినిమాలతో వందల కోట్ల క్లబ్లో చేరుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఏ హీరోకి కానీ ఏ హీరోయిన్ కి కానీ సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేస్తూ అతి చిన్న వయసులోనే "ఇండియన్ బాక్స్ ఆఫీస్ గోల్డెన్ లెగ్" గా పేరు దక్కించుకుంది రష్మిక మందన్న. తన నటనతో కమర్షియల్ సక్సెస్ లు అందుకోవడమే కాకుండా అద్భుతమైన పాత్రల ఎంపికతో తనకంటూ ఒక అభిరుచిని ఏర్పరచుకుంది. ముఖ్యంగా రష్మిక ఏదైనా పాత్ర చేస్తోంది అంటే కచ్చితంగా అది జనాలలోకి వెళ్తుంది అనే నమ్మకం ఆడియన్స్ లో కూడా పెరిగిపోయింది. అలా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా.. ఛలో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. కిరిక్ పార్టీ అనే సినిమాతో తన నటన జీవితాన్ని ఆరంభించింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ వచ్చిన ఈమెకు సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో అదృష్టం పట్టుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత చేసిన పుష్ప2, యానిమల్, ఛావా, సికందర్, కుబేర, థామా అంటూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మరి ఏ సినిమాకు ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.

దేశవ్యాప్తంగా.. పుష్ప సినిమాతో రూ.370 కోట్లు, పుష్ప 2 సినిమాతో రూ.1469.95 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించిన రష్మిక.. ఆ తర్వాత వచ్చిన యానిమల్ సినిమాతో రూ. 556 కోట్లు వసూలు చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది మొదట్లో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో కలిసి ఛావా సినిమా చేసిన రష్మిక.. ఈ సినిమాతో దాదాపు 800 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన సికందర్ మూవీ చేసింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సుమారుగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక తర్వాత తెలుగులో ధనుష్ - నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 130 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. రీసెంట్ గా దీపావళి సందర్భంగా బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలసి థామా సినిమా చేసింది. ఈ సినిమా కూడా సుమారుగా 100 కోట్ల క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక దీన్ని బట్టి చూస్తే పుష్ప సినిమాతో మొదలైన రష్మిక విజయపరంపర వరుస చిత్రాలతో.. 100 కోట్ల క్లబ్లో చేరుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలా మొత్తంగా 6 చిత్రాలతో వరుసగా 100 కోట్ల క్లబ్లో చేరుతూ డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంది రష్మిక మందన్న. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈమె.. మరొకవైపు మైసా, రెయిన్బో చిత్రాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వరుస విజయాలు.. కలెక్షన్లను బట్టి చూస్తే రష్మికను ఇండియన్ బాక్సాఫీస్ గోల్డెన్ లెగ్ అనడంలో సందేహం లేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News