'డాన్ -3'కి ఇన్ని అడ్డంకులున్నాయా?

ర‌ణ‌వీర్ స‌న్నివేశాల‌కు సంబంధించి రీషూట్ నిర్వ‌హించాల్సి ఉందిట‌. ఇది తొలి విడ‌త‌ ఎడిట్ వెర్షన్ త‌ర్వాత క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.;

Update: 2025-07-25 20:30 GMT

రణవీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా ప‌ర్హాన్ అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `డాన్ 3` కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలి సిందే. ఇంత కాలం ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌క‌పోవ‌డానికి కార‌ణంగా కియారా అద్వాణీ పేరు తెర‌పైకి వ‌చ్చింది. కానీ ఆమె ప్ర‌స‌వించ‌డంతో లైన్ క్లియ‌ర్ అయింది. దీంతో డిసెంబ‌ర్ లేదా? జ‌న‌వ‌రి లో రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని...అటుపై మ‌రో రెండు నెల‌ల‌కు కియారా షూట్ లో జాయిన్ అవుతుంద‌ని అంతా భావించారు. ఇంత‌వ‌ర‌కూ కియారా నుంచి లైన్ క్లియ‌ర్ గానే ఉంది.

కానీ అస‌లు సంగ‌తేంటి? అంటే ఇంకా ర‌ణ‌వీర్ సింగ్ న‌టిస్తోన్న `దురంధ‌ర్` షూటింగ్ పూర్తి కాలేద‌న్న విష‌యం తెర మీద‌కు వ‌చ్చింది. దురంధ‌ర్ షూటింగ్ పూర్త‌యింద‌ని...డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డ‌మే ఆల‌స్య‌మ‌ని ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌చారం సాగింది. కానీ దురంధ‌ర్ ఇంకా 10-15 రోజుల షూటింగ్ పెండింగ్ ఉందిట‌. ఆగ‌స్టు..సెప్టెంబ‌ర్ క‌ల్లా ఆ పెండింగ్ షూటింగ్ పూర్తిచేస్తార‌ని స‌మాచారం. ఈ వ‌ర్కింగ్ డేస్ మాత్ర‌మే కాకుండా అద‌నంగా ర‌ణ‌వీర్ సింగ్ నుంచి ఇంకొన్ని కాల్షీట్లు తీసుకోవాల్సి ఉందిట‌.

ర‌ణ‌వీర్ స‌న్నివేశాల‌కు సంబంధించి రీషూట్ నిర్వ‌హించాల్సి ఉందిట‌. ఇది తొలి విడ‌త‌ ఎడిట్ వెర్షన్ త‌ర్వాత క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం. దురంధ‌ర్ ఇప్ప‌టికే డిసెంబ‌ర్ లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క టించారు. ఆ తేదీకి ఎలాగూ రిలీజ్ అవుతుంది. అయితే ర‌ణ‌వీర్ కు డాన్ 3 పాటు మ‌రో క‌మిట్ మెంట్ కూడా పూర్తి చేయాల్సి ఉందని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఓ జోంబీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని జై మొహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సి ఉందిట‌. ఈ చిత్రాన్ని 2026 మిడ్ లో ప్రారంభించేలా స‌న్నాహాలు చేస్తున్నారుట‌.

అంటే అప్ప‌టికి `డాన్ 3` షూట్ నుంచి ర‌ణ‌వీర్ రిలీవ్ అవ్వాలి. ఇది భారీ కాన్వాస్ పై ప్లాన్ చేస్తోన్న చిత్రం. ఇందులో సీజీ , విజువ‌ల్ ఎఫెక్స్ట్ కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంది. వాటి కోస‌మే నెల‌లు స‌మ‌యం ప‌డు తుందిట‌. ఒక‌వేళ ర‌ణ‌వీర్ `డాన్ 3` నుంచి రిలీవ్ అవ్వ‌లేక‌పోతే గనుక‌ ఆ ప్ర‌భావం త‌దుప‌రి సినిమాపై ప‌డుతుంది. ప్ర‌స్తుతం ప‌ర్హాన్ అక్త‌ర్ ఈ విష‌యాల‌న్నింటిని ప‌క్క‌న‌బెట్టి `120 బహదూర్` ప‌నుల్లో బిజీగా ఉన్నాడు.

Tags:    

Similar News