చిరంజీవికి ఫైన‌ల్ ట‌చ‌ప్ ఇచ్చిన చ‌ర‌ణ్

ఆయ‌న అవార్డు అందుకునేందుకు వెళుతూ ఉంటే అక్క‌డ రామ్ చ‌ర‌ణ్ ఫైన‌ల్ ట‌చ‌ప్ ఇస్తున్నారు. చిరు గ్లామ‌ర్ కించిత్ చెద‌ర‌కుండా చిరు త‌న‌యుడు ఎంత జాగ్ర‌త్త తీసుకున్నాడో చూస్తుంటే వీళ్లంతా భ‌లే ఫ‌న్నీ సుమీ!

Update: 2024-05-10 14:46 GMT

మెగాస్టార్ చిరంజీవి ఎంత ప‌ర్ఫెక్ష‌నిస్ట్.. ఎంత ఫ‌న్నీ హోమ్లీ మ్యాన్..! అనేది ఇదిగో ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఆయ‌న ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును రాష్ట్ర‌ప‌తి చేతుల‌మీదుగా అందుకునేందుకు వెళుతూ అంత‌కుముందు ప్రీప్రిప‌రేష‌న్ సాగించిన తీరు ఎంతో ఫ‌న్నీగా ల‌వ్ లీగా అనిపించ‌క మాన‌దు.

చిరు ఎంతో స్టైలిష్ గా సూట్ ధ‌రించి.. ప‌క్క‌పాపిడి దువ్వి.. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని ఎంతో ఇస్మార్ట్ గా రెడీ అయ్యారు. ఆయ‌న అవార్డు అందుకునేందుకు వెళుతూ ఉంటే అక్క‌డ రామ్ చ‌ర‌ణ్ ఫైన‌ల్ ట‌చ‌ప్ ఇస్తున్నారు. చిరు గ్లామ‌ర్ కించిత్ చెద‌ర‌కుండా చిరు త‌న‌యుడు ఎంత జాగ్ర‌త్త తీసుకున్నాడో చూస్తుంటే వీళ్లంతా భ‌లే ఫ‌న్నీ సుమీ! అని అంగీక‌రించ‌క త‌ప్ప‌డం లేదు. ఇక చిరు ప్రిప‌రేష‌న్ కి సంబంధించిన వీడియో తీసే ప‌నిలో ఉపాస‌న చాలా బిజీబిజీగా ఉంది. వెళుతూ వెళుతూ చిరు ఉపాస‌న సెల్ ఫోన్‌నే అద్దంలా భావించి అందులో త‌న ముఖ సౌంద‌ర్యాన్ని పరిశీలించుకుని మ‌రీ వెళ్లారు.

పద్మవిభూషణ్ అవార్డు ప్రదానోత్సవానికి సంబంధించిన‌ ఉపాసన షేర్ చేసిన అరుదైన వీడియోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో తెరవెనుక వీడియోల‌ను షేర్ చేసారు. న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అధికారిక కార్యక్రమానికి ముందు చిరంజీవి వారి కుటుంబ సభ్యుల మధ్య ల‌వ్ లీ మూవ్ మెంట్స్ ఆక‌ర్షిస్తున్నాయి. ఈవెంట్ అనంత‌రం త‌న కుమార్తె క్లిన్ కారాకు పద్మ‌విభూష‌ణ్‌లు అందుకున్న ఇద్ద‌రు తాత‌లు చిరంజీవి, ప్ర‌తాప్.సి రెడ్డి ఉన్నార‌ని ఉపాస‌న స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. ఈ అవార్డుల వేడుకకు కోడలు ఉపాసన కొణిదెలతోపాటు చిరంజీవి భార్య సురేఖ, పిల్లలు రామ్ చరణ్, సుస్మిత తదితరులు హాజరయ్యారు. పద్మ అవార్డు గ్రహీతలకు హోంమంత్రి అమిత్ షా తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు.

Read more!

అమిత్ షాతో చిరంజీవి విందు: ఈ వేడుకలో చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్‌ మంత్రి అమిత్ షాతో ఇంటరాక్ట్ అయిన ఫోటోలు వెబ్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. అమిత్ షా తో కరచాలనం చేస్తున్నప్పుడు చిరంజీవి, చ‌ర‌ణ్‌ అందరూ నవ్వుతూ కనిపించారు. మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పద్మ అవార్డు గ్రహీతలు మాట్లాడుతున్న వీడియోను కూడా ANI షేర్ చేసింది.

చిరంజీవి హైదరాబాద్ చేరారు: శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన చిరంజీవి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ రోజు నాకు పద్మవిభూషణ్ దక్కడంలో సహకరించినందుకు నా దర్శకులు, సహనటుల నుండి నిర్మాతల వరకు అందరికీ ధన్యవాదాలు. ఇది చాలా సంవత్సరాల కృషి. ప్రభుత్వం గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నాను. నా దాతృత్వ కార్యక్రమాలను పక్కన పెట్టి, నన్ను ప్రేమించే వ్యక్తులే ఈ స్థాయికి చేర్చారు... అని అన్నారు.

చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట సోషియో-ఫాంటసీ చిత్రం విశ్వంభరలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Tags:    

Similar News