పెద్ది: గుర్తుపట్టలేని లుక్ తో షాక్ ఇచ్చిన లెజెండ్!

సినిమాల్లో నటీనటులు తమ పాత్రల కోసం ఊహించని స్థాయిలో మేకోవర్ అవ్వడం సహజం.;

Update: 2025-12-29 10:27 GMT

సినిమాల్లో నటీనటులు తమ పాత్రల కోసం ఊహించని స్థాయిలో మేకోవర్ అవ్వడం సహజం. కానీ కొన్ని సార్లు ఆ మేకోవర్ చూస్తే అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోతుంటారు. లేటెస్ట్ గా టాలీవుడ్ స్టైలిష్ విలన్ ఒకరు అలాంటి లుక్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ.. 'ఈయన నిజంగా జగపతిబాబేనా?' అని ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఇప్పటికే టైటిల్ అనౌన్స్ మెంట్ తో అంచనాలు పెంచేసిన చిత్ర బృందం, చికిరి పాటతో కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా కాస్టింగ్ విషయంలోనూ ఆసక్తిని రేపుతోంది. సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న జగపతిబాబు లుక్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఎప్పుడూ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, రిచ్ గా, స్టైలిష్ గా కనిపించే జగ్గూభాయ్ ఇందులో పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో దర్శనమిచ్చారు.

ఈ సినిమాలో ఆయన 'అప్పలసూరి' అనే పాత్రలో కనిపిస్తున్నారు. చింపిరి జుట్టు, కళ్ళజోడు, మాసిన గడ్డం, పాత చొక్కాతో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఇది కచ్చితంగా చాలా రఫ్ అండ్ రస్టిక్ పాత్ర అని అర్థమవుతోంది. రంగస్థలంలో ప్రెసిడెంట్ గారి పాత్రతో భయపెట్టిన జగపతిబాబు, ఇందులో అంతకు మించిన ఇంటెన్సిటీతో కనిపిస్తున్నారని పోస్టర్ తో క్లారిటీ వచ్చింది.

స్వయంగా రామ్ చరణ్ ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ జగపతిబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. "ఆయన స్క్రీన్ మీద పండించే ఇంటెన్సిటీకి సాటిలేరు. మా పెద్ది సినిమాలో అప్పలసూరి పాత్రలో జగ్గూభాయ్ గారు నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. హీరోనే ఇంతలా హైలైట్ చేస్తున్నాడంటే, ఆ పాత్ర సినిమాకు ఎంత కీలకం అనేది ఊహించుకోవచ్చు.

నెటిజన్లు అయితే ఈ లుక్ చూసి షాక్ అవుతున్నారు. మొదట చూడగానే చాలామంది అసలు గుర్తుపట్టలేకపోయారు. కళ్ళల్లో ఆ సీరియస్ నెస్, ముఖంలో ఆ గాంభీర్యం చూస్తుంటే బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారు. విలనిజం పండించడంలో తనకంటూ ఒక కొత్త రూట్ క్రియేట్ చేసుకున్న జగపతిబాబు, అప్పలసూరి పాత్రతో మరో మెట్టు ఎక్కడం ఖాయం అనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అప్పటి వరకు ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇంకెన్ని వస్తాయో చూడాలి. ఏది ఏమైనా ఈ లుక్ మాత్రం సినిమాపై ఉన్న బజ్ ను అమాంతం పెంచేసింది.

Tags:    

Similar News