PR విధానంపై సీనియర్ కమెడియన్ కామెంట్
భూల్ భూలైయా, భాగమ్ భాగ్, మలమాల్ వీక్లీ, ధోల్, చుప్ చుప్ కే వంటి బ్లాక్ బస్టర్లలో నటించాడు రాజ్ పాల్ యాదవ్. బాలీవుడ్ లో పేరున్న కమెడియన్.;
భూల్ భూలైయా, భాగమ్ భాగ్, మలమాల్ వీక్లీ, ధోల్, చుప్ చుప్ కే వంటి బ్లాక్ బస్టర్లలో నటించాడు రాజ్ పాల్ యాదవ్. బాలీవుడ్ లో పేరున్న కమెడియన్. అతడు బాలీవుడ్ లో పీఆర్ విధానం సహా, సినిమా జయాపజయాలకు కారణాలపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. సినిమా తీయడం, చూపించడం మీ చేతుల్లో ఉంది, కానీ అది ఆడుతుందా లేదా అనేది ప్రేక్షకుల చేతిలో ఉంది.. ప్రజలే నిర్ణయిస్తారని సీనియర్ నడుడు రాజ్ పాల్ యాదవ్ అన్నారు. అతడు చివరిసారిగా 2024 యాక్షన్ థ్రిల్లర్ బేబీ జాన్‌లో కనిపించాడు. వెల్‌కమ్ ఫ్రాంచైజీ మూడవ భాగం అయిన 'వెల్‌కమ్ టు ది జంగిల్' లోను అతడు కనిపిస్తాడు. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీలో అక్షయ్ కుమార్ సహా భారీ తారాగణం నటిస్తోంది.
బాలీవుడ్‌లో PR విధానంపై సీనియర్ కమెడియన్ రాజ్ పాల్ చేసిన విశ్లేషణ ఆలోచింపజేసింది. ఒక నటుడు లేదా సినిమా వ్యక్తులు తినడానికి లేదా తాగడానికి ఏదైనా లభించింది అంటే, ఆ మార్గాన్ని చూపించడం వల్లనే.. కాబట్టి PR చాలా ముఖ్యం.. పరిశ్రమలో మనుగడ, విజయానికి ప్రమోషన్లు కావాలంటే పీఆర్ కావాలని అన్నారు. పీఆర్ కొన్నిసార్లు అతిగా ఉంటుందా? అనేదానిపైనా రాజ్‌పాల్ ప్రతిస్పందిస్తూ, ఇదంతా కంటెంట్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. అతిగా ప్రచారం చేసుకుంటే, కంటెంట్ నాణ్యతను చూడాలి... నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవాలి అని రాజ్ పాల్ అన్నారు. బలమైన కథ చెప్పడం, ఆకర్షణీయమైన నట ప్రదర్శనలు ఉన్నప్పుడు పీఆర్ ఏం చేసినా చెల్లుతుందన్నారు.
ఒక సినిమా చిన్నది , పెద్దది అనే భావనలు అనవసరం.ఒక సినిమా మంచిది లేదా చెడ్డది. ఒక సినిమా బాగుంటే, ప్రేక్షకులు దానిని పసిగడతారు. సినిమా చెడ్డది అయితే ప్రేక్షకులను ఎంత అభ్యర్థించినా వారు చూడరు అని ఆయన అన్నారు. ఇది ఒక మాయా మూలిక, ఏ దర్శకుడైనా దీని రహస్యం తెలుసుకుంటే బహుశా 100 సంవత్సరాలలో ఏ సినిమా కూడా ఫ్లాప్ అయ్యేది కాదని రాజ్ పాల్ అన్నారు. తాను బాగా కష్టపడి పని చేసిన సినిమాలు ఆడకపోవడం నిరాశపరిచిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు.