అప్పుడు రజినీ..ఇప్పుడు షారుక్.. ఫ్యాన్స్ కోరిక తీరేదెన్నడు?
ఈ మధ్యకాలంలో ప్రాంతీయ భాషా సినిమా పక్కన పెడితే.. పాన్ ఇండియా సినిమాకి ఆదరణ పెరిగిపోయింది.;
ఈ మధ్యకాలంలో ప్రాంతీయ భాషా సినిమా పక్కన పెడితే.. పాన్ ఇండియా సినిమాకి ఆదరణ పెరిగిపోయింది. నటీనటులు కూడా తమ ప్రాంతీయ చిత్రాలకే పరిమితం కాకుండా పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం వచ్చిన ప్రతి భాషా చిత్రంలో కూడా నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోల చిత్రాలలో బాలీవుడ్ స్టార్స్.. బాలీవుడ్ హీరోల చిత్రాలలో టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అలా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న కాంబో రజనీకాంత్ -షారుక్. వీరిద్దరూ కలిసి ఓకే తెరపై కనిపించాలని ఎన్నో కలలు కన్నారు.
డైరెక్టర్లు కూడా ఈ కాంబోను ఫిక్స్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ అనివార్య కారణాలవల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా రజినీకాంత్ ను మళ్లీ హీరోగా నిలబెట్టింది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న చిత్రం జైలర్ 2. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. చిత్ర బృందం పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి మరీ సంబరాలు జరుపుకున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషించబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వార్తలు రాగా అది కాస్త రూమర్స్ గానే మిగిలిపోయింది.
ప్రస్తుతం షారుక్ ఖాన్ తన కింగ్ సినిమా ప్రాజెక్ట్ లో బిజీగా ఉండడం వల్లే నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ కాంబోలో కీలక పాత్ర చేయాల్సిన షారుక్ తప్పుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ కాంబో ఈసారి సెట్ అవుతుందని అనుకోగా ఇది జరగలేదు. ఇదిలా ఉండగా మరొకవైపు గతంలో కూడా ఈ కాంబో ని తెరపై చూపించడానికి ప్రముఖ డైరెక్టర్ అనుభవ్ సిన్హా కూడా ప్రయత్నం చేశారు.
అసలు విషయంలోకి వెళ్తే.. 2011లో ఇండియన్ హిందీ సూపర్ హీరో చిత్రంగా విడుదలైన చిత్రం రా.వన్. ఇందులో షారుక్ ఖాన్ దిఫాత్రాభినయం చేయగా..గౌరీ ఖాన్ రెడ్ చెల్లిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించింది. ఇందులో అర్జున్ రాంపాల్ విలన్ గా కరీనాకపూర్ , అర్మాన్ వర్మ, షహనా గోస్వామి, దిలీప్ తాహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్ర కోసం దర్శకుడు రజనీకాంత్ ను కలిసి ఒప్పించారు. ఇక అంతా సిద్ధమైంది త్వరలోనే రజినీకాంత్ తన పార్ట్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అని వార్తలు రాగా.. వెంటనే ఆయన ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. కారణం రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఆ అతిథి పాత్ర చేయలేకపోయారు. అలా రెండుసార్లు కూడా ఈ కాంబో సెట్ కాలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ వీరిద్దరి కాంబో ని సెట్ చేసేది ఎవరు? తెరపై చూపించేది ఎవరు? అభిమానుల కోరిక తీర్చేదెవరు ?అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.