రాజమౌళి సార్.. మీకు ఐపీఎల్ చూసే టైముందా?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు SSMB 29 ప్రాజెక్ట్ వర్క్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-02 08:51 GMT

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు SSMB 29 ప్రాజెక్ట్ వర్క్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ అడ్వెంచర్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ లో నటిస్తున్న ఆ మూవీ పనులతో రాజమౌళి కొంతకాలంగా బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఎంత బిజీగా ఉన్నా రాజమౌళి మాత్రం.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ను తప్పకుండా చూస్తున్నారు. మ్యాచ్ లను ఫాలో అవుతున్నారు. అది ఆయన డైరెక్ట్ గా చెప్పకపోయినా.. ఆయన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ కు పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బెంగళూరుతో తలపడనుంది.

నిన్న జరిగిన క్వాలిఫయర్-2లో ముంబైపై పంజాబ్ విజయం సాధించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టారు. ఇప్పుడు క్వాలిఫయర్ 2 మ్యాచ్ పై రాజమౌళి ట్వీట్ చేశారు. పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లడంపై ప్రశంసలు కురిపించారు. శ్రేయస్ అ‍య్యర్‌ ఇన్నింగ్స్ ను కొనియాడారు. ఆయన కోసం రాసుకొచ్చారు జక్కన్న.

బుమ్రా, బౌల్ట్ యార్కర్లను థర్డ్ మ్యాన్‌ దిశగా బౌండరీలకు తరలించిన శ్రేయస్ అ‍య్యర్‌ బ్యాటింగ్ అద్భుతంగా ఉందని రాజమౌళి కొనియాడారు. గతంలో ఢిల్లీ టీమ్‌ ను ఫైనల్‌ కు తీసుకెళ్లినా శ్రేయస్ ను వదిలేశారని.. ఆ తర్వాక కోల్ కతా నైట్ రైడర్స్ కు ట్రోఫీ అందించినా అయ్యర్‌ ను మళ్లీ తీసుకోలేదని రాజమౌళి పోస్ట్ చేశారు.

కానీ ఇప్పుడు దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్‌ ను ఫైనల్‌ కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్‌ టైటిల్‌ కొట్టేందుకు పూర్తిగా ‍అర్హుడని జక్కన పోస్ట్ చేశారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా ఆర్సీబీ తరఫున వేల పరుగులు సాధించాడని.. కానీ ఇప్పుడు ఆయన టైటిల్‌ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

కానీ ఐపీఎల్‌ ఫైనల్ రిజల్ట్ ఏదైనా హార్ట్‌ బ్రేకింగ్‌ మాత్రం తప్పదన్నారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడూ బిజీగా జక్కన్న.. క్రికెట్‌ పై ట్వీట్‌ చేయడంతో ఫ్యాన్స్ హ్యపీగా ఫీలవుతున్నారు. మీకు ఐపీఎల్ చూసే టైమ్ కూడా ఉందా అని ఫన్నీగా నెటిజన్లు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే మహేష్ సినిమా అప్డేట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరో జక్కన్న ఆ విషయంలో ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News