• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  RC16: మళ్ళీ ఎవరు ఆ మాట...

RC16: మళ్ళీ ఎవరు ఆ మాట అనకుండా..

| గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు

By - Tupaki Desk
Update: 2024-03-03 04:21 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీని తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ ని దర్శకుడు స్టార్ట్ చేశాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ రామ్ చరణ్ కి జోడీగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది.

ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్న సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత రెహమాన్ తెలుగులో మ్యూజిక్ అందిస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. సినిమా కోసం బుచ్చిబాబు సానా రెహమాన్ తో సుదీర్ఘంగా మ్యూజిక్ సిట్టింగ్ లో ఉంటున్నారంట. సినిమాకి బెస్ట్ మ్యూజిక్ కావాలని రెహమాన్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది

ఇక ఈ సినిమా కథలో ఉన్న దమ్ము గుర్తించిన రెహమాన్ కూడా మిగిలిన సినిమాలకి భిన్నంగా ఎక్కువ సమయం స్పెండ్ చేసి ఈ సినిమాకి బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంట. సాంగ్స్ తో పాటు థీమ్ మ్యూజిక్, ఓవరాల్ సౌండ్ డిజైన్ పై రెహమాన్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఏఆర్ రెహమాన్ కెరియర్ లోనే బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాలో ఉండే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

రెహమాన్ తమిళ్ సినిమాలపై పెట్టినంత శ్రద్ధ తెలుగు సినిమాలపై పెట్టరు అనే టాక్ ఉంది. అలాగే అతను ఇచ్చిన అవుట్ ఫుట్ తీసుకోవడం తప్ప డైరెక్టర్ కి కావాల్సింది దొరకదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా డైరెక్టర్ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గ మ్యూజిక్ రెహమాన్ ఇస్తున్నారంట. మళ్ళీ ఎవరు కూడా రెహమాన్ తెలుగు సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడు అనేలా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం బుచ్చిబాబు ప్రత్యేకంగా ఆడిషన్స్ చేసి ఉత్తరాంధ్ర మాండలికాన్ని బాగా మాట్లాడగలిగే ఆర్టిస్ట్స్ లని ఎంపిక చేసుకున్నారు.

దీనిని బట్టి బుచ్చిబాబు స్క్రిప్ట్ పైన ఏ స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశారో అర్ధమవుతోంది. రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా పక్కా ఉత్తాంధ్ర స్లాంగ్ లోనే ఈ చిత్రంలో మాట్లాడనుందని తెలుస్తోంది. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. కచ్చితంగా ఈ సినిమాతో బుచ్చిబాబు రామ్ చరణ్ కి అదిరిపోయే బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయం అనే టాక్ నడుస్తోంది.

Tags:    
  • RC16movie 
  • Ramcharan 
  • Arrahman 
  • Buchibabusana 
  • Janhvikapoor 
  • Ramcharanrc16 
  • Filmindustry 
  • Rahmanmusic 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS