తెర వెనుక సూర్య మాన‌సిక పోరాటం!

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య తెరపై ఎప్పుడూ శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు.

Update: 2026-08-20 11:30 GMT

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో సూర్య తెరపై ఎప్పుడూ శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించే సూర్య తెర వెనుక మాత్రం ఎన్నో మానసిక పోరాటాలను ఎదుర్కొన్నారని ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ ఇటీవల వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న రాధిక శరత్‌కుమార్ సూర్య వ్యక్తిగత ప్రయాణం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక నటుడిగా అందరినీ నడిపించే సూర్య, గత కొంతకాలంగా తన కెరీర్‌లో .. వ్యక్తిగత జీవితంలో ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నారో గుర్తు చేసుకున్నారు.

సెలబ్రిటీల జీవితం పైకి ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో? లోపల వారు పడే మానసిక వేదన అంతకంటే ఎక్కువగా ఉంటుందని రాధిక అభిప్రాయపడ్డారు. నిరంతరం అంచనాల ఒత్తిడి, సినిమాల ఫలితాల ప్రభావం నటులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తాయని తెలిపారు. అలాంటి కష్టకాలంలో సూర్య మానసికంగా ఎంతో మదన పడ్డారని, ఆ ఒత్తిడిని అధిగమించడానికి ఆయన ఎంతో అంతర్గత పోరాటం చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

సూర్య స్వతహాగా ఎంతో నిబద్ధత గల నటుడని, ప్రతి సినిమా కోసం తన సర్వస్వాన్ని ధారపోస్తారని రాధిక కొనియాడారు. అయితే అనుకున్న ఫలితాలు రానప్పుడు లేదా అనుకోని అడ్డంకులు ఎదురైనప్పుడు నిజమైన కళాకారులు ఎంత వేదనకు గురవుతారో? సూర్య ఉదంతం చెబుతుందన్నారు. ఆ కష్టాలను తట్టుకుని, మానసిక స్థైర్యంతో మళ్లీ కోలుకుని సక్సెస్ బాట పట్టడం సాధారణ విషయం కాదని ప్రశంసించారు.

ఇబ్బందులన్నింటినీ దాటుకుని `విశ్వనాథ్ అండ్ సన్స్` రూపంలో సూర్య మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడం ఆయన పట్టుదలకు నిదర్శనమని తెలిపారు. ఒక కుటుంబ సభ్యురాలిగా సూర్య పడిన కష్టాలను దగ్గరుండి చూసిన తనకు ఈ విజయం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఈ సక్సెస్ సూర్య‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మొత్తానికి సూర్య తెరవెనుక పడిన మానసిక పోరాటాల గురించి రాధిక శరత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు అభి మానులను కదిలించాయి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిన సూర్య ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. ఈ విజయంతో సూర్య తదుపరి సినిమాలతో మరింత జోరు చూపించడానికి సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News