పిక్‌టాక్ : జిమ్‌లో ఇలా అందంగా కష్టపడుతున్న రాశి

2013లో బాలీవుడ్‌ మూవీ మద్రాస్ కేఫ్‌ తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.;

Update: 2025-08-30 16:30 GMT

2013లో బాలీవుడ్‌ మూవీ మద్రాస్ కేఫ్‌ తో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. కెరీర్‌ ఆరంభంలోనే హీరోయిన్‌గా ఆఫర్లు రాక పోవడంతో వచ్చిన ఆఫర్లతో సర్దుకు పోదాం అనుకుని సినిమాలు చేయడం మొదలు పెట్టింది. 2014 లో లక్కీగా ఊహలు గుసగుసలాడే సినిమాలో నటించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో గుర్తుండి పోయే విధంగా పాత్ర లభించింది, ఆ పాత్రలో చక్కని నటనతో మెప్పించింది. ఆ వెంటనే జిల్‌, శ్రీనివాస కళ్యాణం, సుప్రీం, ప్రతిరోజూ పండుగే, తొలి ప్రేమ ఇలా చాలా సినిమాల్లో నటించింది. అయితే స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు మాత్రం ఈ అమ్మడికి దక్కలేదు. టాలీవుడ్‌లో ఇలాంటి మీడియం రేంజ్ సినిమా ఆఫర్లు వస్తున్న నేపథ్యంలో కోలీవుడ్‌, బాలీవుడ్‌లోనూ ఈ అమ్మడు ప్రయత్నాలు చేసింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో రాశి ఖన్నా ఫాలోయింగ్‌

తమిళ్‌లో ఈ అమ్మడు ఇమైక్క నొడిగల్‌, అయోత్తి, అరన్‌మనై 3 సినిమాల్లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. తెలుగుతో పోల్చితే తమిళ్‌లో కాస్త పెద్ద సినిమాల్లో నటించిందని చెప్పాలి. అయితే అక్కడ కూడా వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో ఆఫర్లు రాలేదు. అయినా కూడా అక్కడ సినిమాలు కంటిన్యూ చేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లో రుద్ర సినిమాలో అజయ్ దేవగన్‌ కి జోడీగా నటించే అవకాశం దక్కింది. అక్కడ నుంచి బాలీవుడ్‌ జర్నీ సైతం ఈ అమ్మడు షురూ చేసింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఉంటారు. అందుకే సోషల్‌ మీడియాలో ఈమెకు ఏకంగా 12 మిలియన్‌ల ఫాలోవర్స్‌ ఉంటారు. రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా తన ఫాలోవర్స్‌కి వినోదాన్ని పంచుతున్న రాశి ఖన్నా తాజాగా మరో సారి సోషల్‌ మీడియాలో తన ఫోటోలను షేర్‌ చేసింది.

వర్కౌట్‌ చేస్తూ కవ్విస్తున్న రాశి ఖన్నా

రాశి ఖన్నా గతంలో కాస్త ఎక్కువ బరువు ఉండేది, కానీ టాలీవుడ్‌లో స్టార్‌డం దక్కాలంటే, యంగ్‌ హీరోలకు జోడీగా నటించాలంటే సన్నగా నాజూకుగా ఉండాలి. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్కౌట్స్ చేస్తూనే ఉంది. సన్నాగా నాజూకుగా ఉన్నప్పటికీ రాశి ఖన్నా తన రెగ్యులర్ వర్కౌట్‌లను మాత్రం ఎప్పుడూ ఆపదు. తాజాగా మరోసారి తన వర్కౌట్‌ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు టైట్‌ స్పోర్ట్స్ బ్రా ధరించి, బ్లాక్‌ పాయింట్‌ను ధరించిన రాశి ఖన్నా వెనుక వైపు నుంచి తీసిన ఫోటోలను షేర్‌ చేసింది. రాశి ఖన్నా స్కిన్‌ షో చేసినా, చేయకున్నా ఓ రేంజ్‌ లో ప్రేక్షకులు ఆమెను అభిమానిస్తారు, ఆరాధిస్తారు అనే విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ ఫోటోలను సైతం సోషల్‌ మీడియాలో తెగ లైక్ చేసి, ఫోటోలను షేర్‌ చేస్తున్నారు.

తెలుసు కదా సినిమాలో సిద్దుకు జోడీగా..

తెలుగులో ఈమె సినిమా వచ్చి చాలా రోజులు అయింది. కాస్త గ్యాప్‌ తీసుకున్న ఈమె తిరిగి సిద్దు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సిద్దు జొన్నలగడ్డతో నటించడం ద్వారా ఖచ్చితంగా రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో మరింత గుర్తింపు దక్కడంతో పాటు, ముందు ముందు స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశం కూడా దక్కవచ్చు అంటున్నారు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా ఈమె షేర్‌ చేసే ఫోటోలు, వీడియోల కారణంగా తెలుగు కదా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి. తెలుసు కదా సినిమా తర్వాత తమిళ్‌ తో పాటు హిందీలో ఈమె మరిన్ని సినిమాలు చేస్తుందా అనేది చూడాలి.

Tags:    

Similar News