• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఐటెమ్ సాంగ్ కోసం 6 కోట్లు...

ఐటెమ్ సాంగ్ కోసం 6 కోట్లు సేవ్ చేశారు.. కానీ..

| శ్రీలీల ఈ సాంగ్ కోసం దాదాపు ఒకటిన్నర కోట్లు పొందినట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-11-08 12:31 GMT

పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్కవ్వాలి అంటే ఈ రోజుల్లో స్టార్ క్యాస్ట్ కూడా ఒక ప్రధాన ఆయుధంగా మారింది. అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు వివిధ ఇండస్ట్రీలలోని స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నారు. అయితే ఇదే అదునుగా సినీ తారలు కూడా రెమ్యునరేషన్ తో షాక్ ఇస్తున్నారు. సినిమా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో పారితోషకం డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటెమ్ సాంగ్స్ కోసం హీరోయిన్లు అసలు తగ్గడం లేదు.

ఇక పాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేయబోయే హీరోయిన్ ఎవరు అనే చర్చ చాలా కాలం నుంచి జరుగుతోంది. మంచి హైప్ ఉన్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ లేదా టాలీవుడ్ నుంచి పెద్ద స్టార్‌ని తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. చివరికి ఐటమ్ సాంగ్‌లో కనిపించబోయే తారగా శ్రీలీల పేరును ప్రకటించారు. ఇది కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఎందుకంటే పాన్ ఇండియా మూవీ అయినందున బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ని ఎంపిక చేస్తారనుకున్నా, ఫైనల్ గా ఈ అవకాశం శ్రీలీలకు దక్కడం విశేషం. నిజానికి, ఈ ఐటమ్ సాంగ్ కోసం యూనిట్ మొదట బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను సంప్రదించింది. శ్రద్ధా కూడా ముందుగా ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పి, డేట్స్ కూడా కేటాయించింది.

కానీ, ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ యూనిట్‌ను ఆలోచనలో పడేసింది. ఈ ఒక్క సాంగ్ కోసం ఆమె ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలను కోట్ చేయడం యూనిట్‌కు షాక్ ఇచ్చిందట. అయితే, యూనిట్ కొంత వరకూ రెమ్యూనరేషన్ తగ్గించాలని ట్రై చేసినా, శ్రద్ధా తన డిమాండ్‌ నుంచి దిగిరాలేదు. ఇక ప్రత్యామ్నాయం కోసం యూనిట్ వెతుకులాట మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో శ్రీలీల పేరు లిస్ట్ లోకి వచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల ఒక మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా ధమాకా సినిమా ఆమె వల్లే హిట్టయ్యిందనే బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఇక మహేష్ గుంటూరు కారం సినిమాలో ఆమె చిందులేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. దాంతో, ఆమెను ఈ ఐటమ్ సాంగ్‌కి తీసుకునేందుకు యూనిట్ నిర్ణయించింది. పైగా, శ్రీలీల ఇచ్చిన రెమ్యూనరేషన్ డిమాండ్ కూడా అందుబాటులో ఉండడంతో యూనిట్‌కు సులభంగా నిర్ణయం తీసుకోవడానికి అనుకూలమైంది. శ్రీలీల ఈ సాంగ్ కోసం దాదాపు ఒకటిన్నర కోట్లు పొందినట్లు తెలుస్తోంది.

శ్రీలీలను రప్పించి మేకర్స్ 6 కోట్ల వరకు ఆదా చేయడం బాగానే ఉంది కానీ నార్త్ సైడ్ బిజినెస్ దృష్ట్యా శ్రద్ధా కపూర్ ను కాకపోయినా మరొకరిని తీసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే పుష్ప 2 కి నార్త్ లో ఈజీగా 200 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక కాస్త గ్లామర్ డోస్ తోడైతే లెక్క పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మేకర్స్ మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ పైనే భారీ హోప్స్ పెట్టుకున్నారు. శ్రీలీల డ్యాన్స్ కూడా, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సుకుమార్ టీమ్ ధీమాగా ఉంది. మరి వారి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Tags:    
  • Pushpa2 
  • Sreeleela 
  • Shraddhakapoor 
  • Bollywood 
  • Northaudience 
  • Moviecollections 
  • Samantharuthprabhu 
  • Gunturkaaram 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS