పూరీ బెగ్గర్ లో అతనున్నాడా.. ఏం జరుగుతుంది..?
ఐతే అందరినీ ఆశ్చర్య పరుస్తూ పూరీ జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా లాక్ చేసుకున్నాడు.;
ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న పూరీ జగన్నాథ్ నెక్స్ట్ తీసిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరీ తో సినిమా చేసే హీరో ఎవరా అన్న డౌట్ మొదలైంది. ఐతే అందరినీ ఆశ్చర్య పరుస్తూ పూరీ జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ లాక్ చేశారు. సినిమాలో టబు, రాధిక ఆప్టే లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఐతే ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్ర కోసం పెద్ద చర్చ నడుస్తుంది. పూరీ ఆలోచనల్లో బాలీవుడ్ యాక్టర్ సౌరభ్ సచ్‌దేవా ఉన్నాడట. అతనితో పాటు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ కూడా ఉన్నాడట. ఫాహద్ ని కలిసి కథ చెప్పడం జరిగిందట. అతని రెస్పాన్స్ కోసం పూరీ వెయిట్ చేస్తున్నాడు. ఒకప్పుడు పూరీ పాత్రలు అనుకోవాలే కానీ వాళ్లే వచ్చి చేస్తామని అనే వారు. కానీ ఇప్పుడు పూరీ డౌన్ ఫాల్ లో ఉన్నాడు.
అయినా కూడా సినిమా ఫలితాలకు అతని టాలెంట్ కి సంబంధం ఉండదు అనుకునే వాళ్లే పూరీతో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ సేతుపతి కూడా పూరీ ఇదివరకు సినిమాల ఇంపాక్ట్ తోనే ఆయనతో సినిమాకు రెడీ అయ్యారు. ఐతే ఈ సినిమాలో కాస్టింగ్ కూడా భారీగా ఉంటుందని తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్ ఓకే అయితే మాత్రం ఈ సినిమాకు మరో స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే లెక్క.
ముఖ్యంగా విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ఇద్దరు లోకేష్ కనకరాజ్ చేసిన విక్రం సినిమాలో నటించారు. ఆ సినిమాలో విజయ్ విలన్ గా చేశాడు. ఇప్పుడు పూరీ విజయ్ కాంబోలో వస్తున్న బెగ్గర్ లో విజయ్ హీరోగా చేస్తుంటే ఫాహద్ ని విలన్ గా తీసుకునే ఆలోచనల్లో ఉన్నారు. సో పూరీ, విజయ్ సేతుపతి, ఫాహద్ ఈ కాంబో సెట్ అయితే మాత్రం తప్పకుండా సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.
పూరీ కూడా ఈ బెగ్గర్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది. మరి పూరీ మార్క్ సినిమాగా బెగ్గర్ వస్తుందా లేదా అన్నది చూడాలి. పూరీ కంబ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చూస్తుంటే బెగ్గర్ తో అది కుదిరేలా ఉందనే పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది.