• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగుపాముగా మారే యువ‌కుడి...

నాగుపాముగా మారే యువ‌కుడి క‌థ‌తో

| ఫిలిం ఇనిస్టిట్యూట్ లో న‌ట‌శిక్ష‌ణ పొందిన త‌ర్వాత చిరంజీవి అలియాస్ కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మ‌ద్రాసులో చాలా ప్ర‌య‌త్నాలు చేసారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు కెరీర్ తొలి ద‌శ‌లో మంచి విజ‌యం సాధించిన చిత్రం - పున్న‌మి నాగు.

By - Tupaki Desk
Update: 2025-06-14 04:04 GMT

ఫిలిం ఇనిస్టిట్యూట్ లో న‌ట‌శిక్ష‌ణ పొందిన త‌ర్వాత చిరంజీవి అలియాస్ కొణిదెల శివ‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ మ‌ద్రాసులో చాలా ప్ర‌య‌త్నాలు చేసారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు కెరీర్ తొలి ద‌శ‌లో మంచి విజ‌యం సాధించిన చిత్రం - పున్న‌మి నాగు. న‌టుడిగా చిరుకి గొప్ప గుర్తింపు తెచ్చిన చిత్ర‌మిది. ఎం. రాజశేఖర్ దర్శకత్వంలో 1980లో విడుదలైంది. ఇందులో చిరంజీవి, నరసింహ రాజు, రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం. కుమరన్, ఎం. శరవణన్, ఎం. బాలసుబ్రమణియం కలిసి ఎవియం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఇది నాగులు అనే పాములను ఆడించుకునే వ్యక్తి క‌థ‌. అత‌డు పూర్ణిమ అనే యువతిని ప్రేమిస్తాడు. మేనక పెంపుడు అన్న రాజు నాగులు చెల్లెలు వరసైన లక్ష్మిని ప్రేమిస్తాడు. నాగులు తండ్రి చిన్నప్పటి నుంచి అతనికి కొంచెం కొంచెం పాము విషం తినే తిండిలో కలిపి ఇస్తుంటాడు. దీనివల్ల అతనికి పాము కరిచినా ఏమీ కాకుండా ఉంటుంది. ప్రతి పౌర్ణమికీ అతడు ఒక కన్యను వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు. అతడిని కలిసిన అమ్మాయిలంతా అతడిలో ఉన్న విషానికి బలవుతూ ఉంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఒకసారి పూర్ణిమ కూడా అలాగే మరణిస్తుంది. చనిపోయిన పూర్ణిమ ఒంటి మీద ఎక్కడా పాము కాటు గుర్తులు లేకపోవడంతో రాజుకు నాగులు మీద అనుమానం మొదలవుతుంది. ఒక యువతి ఆ ఊరికి టీచర్ గా వచ్చి నాగులు చేతిలో మరణిస్తుంది. రాజు ఆమె చేతిలో ఉన్న కెమెరాను చూసి నాగులు పాములా మారిపోయినట్లు గమనిస్తాడు. నాగులు తండ్రి చనిపోబోయే ముందు ఆ రహస్యాన్ని నాగులుకి వెల్లడిస్తాడు. నాగులు దానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే బాగా ఆలస్యం అయిపోయి ఉంటుంది. అతని చర్మం పాము కుబుసం లాగా కొంచెం కొంచెం ఊడిపోతూ ఉంటుంది. ఊరి వాళ్ళు రాకముందే అక్కడి నుంచి పారిపొమ్మని అతనికి రాజు సలహా ఇస్తాడు. కానీ నాగులు తనకు పాములాగా బతకడం కన్నా మరణమే శరణ్యమని కొండమీద నుంచి దూకి మరణిస్తాడు.

అద్భుత‌మైన క‌థాంశంతో పాటు చ‌క్ర‌వ‌ర్తి ట్యూన్స్ , వేటూరి సాహిత్యం, న‌టీన‌టుల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో పున్న‌మినాగు ర‌క్తి క‌ట్టిస్తుంది. నాగులు పాత్ర‌లో చిరంజీవి అభిన‌యం, ఆహార్యం ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ప‌తాక స‌న్నివేశాల్లో చిరంజీవి డైలాగులు కంట‌త‌డి పెట్టిస్తాయి. 13 జూన్ 1980లో ఈ చిత్రం విడుద‌లైంది. అప్ప‌టికే విడుద‌లై విజ‌యం సాధించిన క‌న్న‌డ చిత్రం 'హున్నుమియే రాత్రియాలి' అనే చిత్రానికి అధికారిక రీమేక్ పున్న‌మినాగు. నాగుపాముగా మారే యువ‌కుడి క‌థ‌తో నాలుగు ద‌శాబ్ధాల క్రిత‌మే ఫిక్షన్ సినిమా తీసిన ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ ప్ర‌తిభ‌ను మెచ్చుకుని తీరాలి. నేటి ట్రెండ్ లో చూస్తే ఇది కూడా పాన్ ఇండియ‌న్ సినిమానే.

Tags:    
  • PunnamiNaagu 
  • Chiranjeevi 
  • TollywoodClassics 
  • VintageTeluguCinema 
  • 80sHorror 
  • ChakravarthyMusic 
  • VetriLyrics 
  • MadrasDays 
  • IndianCinemaHistory 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS