బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ స్కెచ్.. గేమ్ రీస్టార్ట్..!

నటుడిగా ప్రేక్షకులను అలరించిన బండ్ల గణేష్ నిర్మాతగా కూడా తన మార్క్ చూపించారు.;

Update: 2025-12-30 05:52 GMT

నటుడిగా ప్రేక్షకులను అలరించిన బండ్ల గణేష్ నిర్మాతగా కూడా తన మార్క్ చూపించారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో బండ్ల గణేష్ సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. అందులోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, ఎన్టీఆర్ టెంపర్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఐతే కొన్నాళ్లుగా తన బ్యానర్ లో సినిమాలు చేయని బండ్ల గణేష్ బ్యానర్ పేరుని మార్చి కొత్త ప్రయత్నం చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ని ఇప్పుడు BG అదే బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ అంటూ వస్తున్నారు.




 


కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్..

బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ లో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. స్టార్స్ ఉన్నా లేకపోయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఈమధ్య కాలంలో అలా కంటెంట్ తో ఎలాగోలా ఆడియన్స్ ని కన్విన్స్ చేసిన సినిమాలు అద్భుతాలు సృష్టించాయి. అందుకే బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ లో కొత్త వాళ్లతో పాటుగా కొత్త ఎక్స్ పెరిమెంట్స్ తో సినిమాలు చేయాలని చూస్తున్నారు.

ఆల్రెడీ స్టార్ హీరోలు చేసిన బ్యానర్ అందులోనూ సూపర్ హిట్లు కొట్టిన బ్యానర్ కాబట్టి ఆ ఎక్స్ పీరియన్స్ ని కొత్త కథలు.. కంటెంట్ ఉన్న సినిమాలకు ఉపయోగపడేలా అదిరిపోయే ప్లానింగ్ తో వస్తున్నారు. సో ప్రతిభ గల వాళ్లు ఎవరైనా BG బ్లాక్ బస్టర్స్ తో పనిచేసే అవకాశం ఉంటుంది. ఎలాగు సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి ఎలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలి అన్నది బండ్ల గణేష్ కి తెలుసు కాబట్టి ఆయన చేసే కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తప్పకుండా కావాల్సినంత ప్రేక్షకాదరణ దక్కేలా ప్రమోట్ చేస్తారు.

BG బ్లాక్ బస్టర్స్ తో బండ్ల గణేష్..

బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్ తో బండ్ల గణేష్ నిర్మాతగా మళ్లీ గేమ్ రీస్టార్ట్ చేశారు. తప్పకుండా ఈ బ్యానర్ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు రావాలని కోరుతున్నారు ఆడియన్స్. ఈమధ్యనే బండ్ల గణేష్ సినిమా పరిశ్రమలోని పెద్దలందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా BG బ్లాక్ బస్టర్స్ అనే బ్యానర్ ని అనౌన్స్ చేస్తూ సర్ ప్రైజ్ చేశారు. మరి ఈ బ్యానర్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయి.. BG బ్లాక్ బస్టర్స్ తో బండ్ల గణేష్ ప్లానింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి.

ఆల్రెడీ సక్సెస్ ఫుల్ నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ ఆఫ్టర్ షార్ట్ గ్యాప్ మళ్లీ తన కొత్త బ్యానర్ తో ఈసారి బ్లాక్ బస్టర్స్ టార్గెట్ తో రంగంలోకి దిగుతున్నారు. మరి ఈసారి బండ్ల గణేష్ అటెంప్ట్ ఆడియన్స్ కి ఎలాంటి కిక్ ఇస్తాయన్నది చూడాలి.

Tags:    

Similar News