వితౌట్ మేకప్ లో దర్శనమిచ్చిన ప్రియాంక జవాల్కర్.. బాబోయ్

సాధారణంగా హీరోయిన్స్ కెమెరా ముందే కాదు పబ్లిక్ లో కూడా వితౌట్ మేకప్ లో కనిపించడానికి అసలు ఆసక్తి కనబరచరు.;

Update: 2026-02-19 23:30 GMT

సాధారణంగా హీరోయిన్స్ కెమెరా ముందే కాదు పబ్లిక్ లో కూడా వితౌట్ మేకప్ లో కనిపించడానికి అసలు ఆసక్తి కనబరచరు. ఇల్లు దాటి బయటకు వచ్చారంటే చాలు ముఖం మీద మెరిసే మేకప్ ఉండాల్సిందే. ఎంతటి బిజీ షెడ్యూల్లో అయినా సరే అందంగా ముస్తాబవడం అందరి అలవాటు. సెలబ్రిటీలే కాదు అమ్మాయిలు కూడా బయటకు వచ్చామంటే చాలు చాలా అందంగా ముస్తాబయి.. తమ అందంతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఆ మేకప్ వెనుక ఉన్న అసలైన రూపం చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. వాస్తవానికి కొంతమందిని మేకప్ లేకుండా అస్సలు చూడలేం. మరికొంతమంది మేకప్ లేకపోయినా వారు తమ సహజ అందంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.




 


ఇకపోతే వితౌట్ మేకప్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో సాయి పల్లవి తర్వాత ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా సహజంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ తాజాగా వితౌట్ మేకప్ లో కూడా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచింది. సింపుల్ లుక్ లో కనిపిస్తూ అభిమానుల హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఎప్పుడూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.అలాంటిది ఇప్పుడు మేకప్ లేకుండా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.




 


పచ్చని చెట్ల మధ్య సింపుల్ లుక్ లో.. మెస్సీ హెయిర్ తో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇకపోతే ఇలా మేకప్ లేకుండా నేచురల్ స్కిన్ తో సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసేసరికి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "మీరు చాలా గ్రేట్.. గ్లామర్ ఫీల్డ్ లో ఉండి కూడా ఇలా వితౌట్ మేకప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయినా మీరు చాలా సహజంగా ఉన్నారు" అని ఒక అభిమాని కామెంట్ చేయగా.. మరొక అభిమాని "మీ స్కిన్ టోన్ తో నా హృదయాన్ని కరిగించేశారు" అంటూ కామెంట్ చేశారు. ఇంకొక అభిమాని "నీ అందానికి దాసోహం సఖి" అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మొత్తానికైతే కామెంట్ బాక్స్ మొత్తం ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ తమ అభిప్రాయాలను పంచుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.




 


ప్రియాంక జవాల్కర్ విషయానికి వస్తే.. అనంతపూర్ ప్రాంతానికి చెందిన ఈమె కలవరంఆయే సినిమాతో 2017లో ఇండస్ట్రీకి పరిచయం అయిన ప్రియాంక.. విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా సినిమాతో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత తిమ్మరసు, గగనం వంటి చిత్రాలలో నటించి మంచి పేరు అందుకుంది. తన నటనతో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకుంది.

Tags:    

Similar News