'సలార్' స్టార్ చేతిలో కాంతార...!
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాగా వచ్చిన 'కాంతార' పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే;
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న సినిమాగా వచ్చిన 'కాంతార' పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగులోనూ కాంతార సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కాంతార టీం మరో పార్ట్‌ను ప్లాన్ చేయడం జరిగింది, ఆ పార్ట్ షూటింగ్ కూడా దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది కాంతార 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు, ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. కాంతార సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సహజంగానే కాంతార 2 సినిమా కి ప్రీ రిలీజ్ బజ్ భారీగా క్రియేట్ అవుతుంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతుందని సమాచారం అందుతోంది.
కాంతార ప్రీ రిలీజ్ బిజినెస్
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాంతార 2 సినిమా అన్ని భాషల డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేయడం జరిగింది. తెలుగు థియేట్రికల్ డబ్బింగ్ రైట్స్ ఏకంగా రూ.100 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం అందుతోంది. కాంతార సినిమా కథకు ముందు జరిగే కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందుకే కాంతార చాప్టర్ 1 అనే టైటిల్‌తో రాబోతుంది. ఈ కొత్త కాంతార సినిమాను హోంబలే సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. వారు పెట్టిన పెట్టుబడి విడుదలకు ముందే వెనక్కి వచ్చే రేంజ్‌లో బిజినెస్ జరుగుతుంది. హిందీలో కాంతార సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ మొత్తాన్ని ఇచ్చి కొనుగోలు చేసేందుకు రెడీగా ఉందనే వార్తలు వస్తున్నాయి.
మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్..
ఇక మలయాళంలో ఇతర భాషల సినిమాలు అంతగా ఆడవు అనే అభిప్రాయం ఉంది. కానీ ఈ సినిమాకి మాత్రం భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. అంతే కాకుండా ఈ సినిమా మలయాళ డబ్బింగ్ రైట్స్ ను ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తీసుకున్నారు. సలార్ సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్‌గా నిలిచిన పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. మలయాళంలోనే కాకుండా అన్ని భాషల సినిమాల్లోనూ ఇతడు నటిస్తున్నాడు. నటుడిగా ఇంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు నిర్మాతగానూ కనిపిస్తూ ఉంటాడు. తన సొంత బ్యానర్ ద్వారా ఇప్పుడు కాంతార సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు పెరగడం ఖాయం.
కాంతార చాప్టర్ 1 తెలుగు బిగ్ రిలీజ్
భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు మలయాళంలో విడుదల అయ్యి కనీసం కోటి రూపాయలు వసూళ్లు చేయలేని పరిస్థితి ఉంది. కానీ కాంతార చాప్టర్ 1 సినిమా మాత్రం మలయాళంలో ఖచ్చితంగా భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మంచి కంటెంట్‌తో పాటు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ కావడం వల్ల కూడా మంచి బజ్ క్రియేట్ కావడం ఖాయం. అందుకే కాంతార 1 సినిమా మలయాళ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం. ఇక తెలుగు రాష్ట్రాలు, ఉత్తర భారతంలో భారీ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. తమిళనాడులో ఈ సినిమాకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి. కాంతార సినిమా గతంలో ఎక్కువ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతాల్లో కాంతార చాప్టర్ 1 ను భారీగా రిలీజ్ చేస్తున్నారు.