ప్రేమలు 2 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!
గిరీష్ AD డైరెక్ట్ చేసిన ప్రేమలు సినిమాలో నెస్లెన్, మ్యాథ్యూ థామస్, మమితా బైజు, అఖిల ప్రధాన పాత్రల్లో నటించారు.;

మలయాళం లో తెరకెక్కించ ప్రేమలు సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా తెలుగులో ప్రేమలు సూపర్ హిట్ అయ్యింది. దానికి కారణం సినిమా ఎక్కువ భాగం హైదరాబాద్ లో నడుస్తుంది. అందుకే మన వాళ్లు ఇంకాస్త ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అంతేకాదు మమితా బైజు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ వల్ల యూత్ ఆడియన్స్ అంతా కూడా రిపీటెడ్ గా చూశారు.
గిరీష్ AD డైరెక్ట్ చేసిన ప్రేమలు సినిమాలో నెస్లెన్, మ్యాథ్యూ థామస్, మమితా బైజు, అఖిల ప్రధాన పాత్రల్లో నటించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా చేరింది. 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 80 నుంచి 100 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టింది. ఐతే ప్రేమలు సినిమా సక్సెస్ అవ్వడమే ఆలస్యం ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రేమ 2 అనౌన్స్ చేశారు మేకర్స్.
ప్రేమలు సినిమాలో నటించిన జంట నెస్లెన్, మమితా బైజులకు సూపర్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు ప్రేమలు 2 కొనాసాగించినా కూడా ఇదే బజ్ ఉంటుందని చిత్ర యూనిట్ కనిపెట్టారు. అందుకే ప్రేమలు 2 మొదలు పెట్టారు. లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లోనే ప్రేమలు 2 మొదలైంది. ఐతే ఇప్పటివరకు ఆ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో అప్డేట్ రాలేదు. సినిమా ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా లేదా అన్న క్లారిటీ కూడా లేదు. ఓ పక్క మమితా బైజు తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.
నెస్లెన్ కూడా ఈమధ్యనే తన జింఖానా సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రేమలు 2 ఈ ఇయర్ రిలీజ్ ఉంటుందా ఒకవేళ రిలీజ్ ఉంటే ఎప్పుడు వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ప్రేమలు ఐతే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యింది. ప్రేమలు 2 మీద కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. మరి వాటిని సినిమా అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఐతే ప్రేమలు సూపర్ హిట్ కాబట్టి సీక్వెల్ కి మంచి బజ్ ఉంటుంది. అందుకు తగినట్టుగా సినిమా ఉంటే మాత్రం ఈ సీక్వెల్ కూడా రికార్డులను సృష్టించే ఛాన్స్ ఉంటుంది.