'కన్నప్ప' బ్యూటీ.. అలాంటి రోల్స్ కోసం వెయిట్ చేస్తుందట!

అయితే సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది అమ్మడు. తాను పోషించిన రోల్ లో ధైర్యంగా కనిపించిన ప్రీతి.. పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి.;

Update: 2025-07-02 06:09 GMT

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఆ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించగా.. కోలీవుడ్ అమ్మాయి ప్రీతి ముకుందన్ ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసింది.

అయితే కన్నప్ప మూవీలో హీరోయిన్‌ గా ముందు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్‌ ను తీసుకున్నారు. కానీ నుపుర్ సనన్ కన్నప్ప నుంచి ఆ తర్వాత తప్పుకున్నారు. ఆ సమయంలో ప్రీతి ముకుందన్‌ కు ఛాన్స్ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన సినిమాలో యాక్ట్ చేసింది.

అయితే సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకుంది అమ్మడు. తాను పోషించిన రోల్ లో ధైర్యంగా కనిపించిన ప్రీతి.. పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి. అలా హైలెట్ గా నిలిచి.. యూత్ ను తన అందచందాలతో బాగా అట్రాక్ట్ చేసింది అమ్మడు. అదే సమయంలో పలువురు టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో కూడా ఆమె పడినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు కొందరు మేకర్స్.. ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే తన అప్ కమింగ్ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ చేయాలని ప్రీతి ముకందన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటుందని టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కాగా, కోలీవుడ్ కు చెందిన ప్రీతి.. టాలీవుడ్ మూవీతోనే తెరంగేట్రం చేసింది. ఆ సినిమా కన్నప్ప కాదు.. యంగ్ హీరో శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటించిన శ్రీ విష్ణు కామెడీ సినిమాతో ఓం భీమ్ బుష్‌ తో డెబ్యూ ఇచ్చింది. ఆ సినిమాతో అనుకున్నంత పేరు రాలేదు. ఆ తర్వాత కోలీవుడ్ లో స్టార్ అనే మూవీతో అరంగేట్రం చేసింది.

ఇప్పుడు కన్నప్పతో సందడి చేయగా.. ప్రస్తుతం ఆమె లైనప్ లో రెండు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో మైనే ప్యార్ కియా, తమిళంలో ఇదయం మురళి సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఆ చిత్రాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో ప్రీతి ఎలాంటి ఛాన్సులు అందుకుంటుందో.. తెలుగులో ఎలా మెప్పిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News